AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Little Soldiers: లిటిల్ సోల్జర్ సినిమాలో నటించిన ఈ చిన్నారి గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందో..? ఏం చేస్తుందో తెలుసా.?

విబిబిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఇద్దరు చిన్న పిల్లలే ప్రధాన పాత్రధారులు. ఆ ఇద్దరు చిన్నారులు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.. లిటిల్ సోల్జర్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చేసిన వారిలో బాలాదిత్య ఒకరు

Little Soldiers: లిటిల్ సోల్జర్ సినిమాలో నటించిన ఈ చిన్నారి గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందో..? ఏం చేస్తుందో తెలుసా.?
Little Soldiers
Rajeev Rayala
|

Updated on: Jan 21, 2023 | 10:27 AM

Share

ఇటీవల కాలంలో హీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోలను గూగుల్ లో తెగ గాలించేస్తున్నారు నెటిజన్లు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించిన వారు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఒకప్పుడు సూపర్ హిట్ గా నిలిచి ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాల్లో లిటిల్ సోల్జర్ అనే సినిమా ఒకటి. విబిబిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఇద్దరు చిన్న పిల్లలే ప్రధాన పాత్రధారులు. ఆ ఇద్దరు చిన్నారులు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.. లిటిల్ సోల్జర్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చేసిన వారిలో బాలాదిత్య ఒకరు. బాలాదిత్య ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 6లో కాంటెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మరో చిన్నారి ఎవరో తెలుసా..? ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ఈ సినిమాలో చిన్న పాపగా నటించిన ఆమె పేరు కావ్య. లిటిల్ సోల్జర్స్ సినిమాలో కావ్య చిలిపి చేష్టలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఈ చిత్రం కల్ట్ క్లాసిక్ మరియు కావ్య అన్నపరెడ్డికి ఉత్తమ బాలనటి అవార్డు కూడా వచ్చింది.

లిటిల్ సోల్జర్స్ సినిమా తర్వాత కావ్య పెద్దగా సినిమాల్లో నటించలేదు. ఇటీవలే పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది ఈమె. కావ్య ప్రస్తుతం డాక్టర్ గా స్థిరపడింది. కుశాల్ హిప్పల్‌గావ్‌కర్‌తో కావ్య వివాహం జరిగింది. తాజాగా ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. KavyaKavya1

Kavya1