రాకింగ్ రాకేశ్‌- జోర్దార్ సుజాతల పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌.. ఎంగేజ్‌మెంట్‌ డేట్‌ను అధికారికంగా ప్రకటించిన లవ్‌బర్డ్స్‌

బుల్లితెర ప్రేమ పక్షులు రాకింగ్ రాకేశ్‌- జోర్దార్‌ సుజాతల పెళ్లిపీటలెక్కేందుకు రెడీ అయ్యారు. గత కొద్దికాలంగా ప్రేమలో మునిగితేలుతున్న వీరిద్దరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌ అయ్యింది. ఈ విషయాన్ని అధికారికంగా తన యూట్యూబ్ ఛానల్‌ ద్వారా జోర్దార్ సుజాత ప్రకటించింది.

రాకింగ్ రాకేశ్‌- జోర్దార్ సుజాతల పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌.. ఎంగేజ్‌మెంట్‌ డేట్‌ను అధికారికంగా ప్రకటించిన లవ్‌బర్డ్స్‌
Jordhar Sujatha,rocking Rakesh
Follow us
Basha Shek

|

Updated on: Jan 20, 2023 | 6:00 AM

బుల్లితెర ప్రేమ పక్షులు రాకింగ్ రాకేశ్‌- జోర్దార్‌ సుజాతల పెళ్లిపీటలెక్కేందుకు రెడీ అయ్యారు. గత కొద్దికాలంగా ప్రేమలో మునిగితేలుతున్న వీరిద్దరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌ అయ్యింది. ‘మా ప్రేమ ప్రయాణం గమ్యానికి చేరింది’ అంటూ  ఈ విషయాన్ని అధికారికంగా తన యూట్యూబ్ ఛానల్‌ ద్వారా జోర్దార్ సుజాత ప్రకటించింది. తమ నిర్ణయాన్ని పెద్దలు కూడా గౌరవించరాని, పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ఈ వీడియోలో తెలిపింది సుజాత. అలాగే రాకింగ్ రాకేశ్ తో తన పరిచయం.. ఆ తర్వాత స్నేహం.. అది ప్రేమకు దారి తీయడం.. ఇరు కుటుంబాలు అంగీకరించడం.. చివరకు పెళ్లి వరకు రావడం.. ఎన్నో మధుర జ్ఞాపకాలను ఈ వీడియోలో పంచుకుంది సుజా. కాగా ఈ నెల చివరిలో తమ ఎంగేజ్‌మెంట్‌ ఉండనుందని, అదే రోజున లగ్నపత్రిక రాసుకుని పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకుంటామని తెలిపింది. ‘ఎట్టకేలకు పెద్దలందరూ కలిసి మాకు పెళ్లి చేయనున్నారు. ఈ నెల చివరిలో మా నిశ్చితార్థం జరగనుంది. ఆ రోజే లగ్న పత్రిక కూడా రాసుకుంటాం. ఇకపై వీళ్ల రిలేషన్ కరెక్టేనా? అనే అనుమానాలు, ప్రశ్నలు మీకు ఉండవని అనుకుంటున్నాను. మా ఎంగేజ్‌మెంట్ వీడియో కూడా మీకు చూపిస్తాను. మంచి భర్త రావాలి. మంచి కుటుంబం రావాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాల్ని’ అని ఈ వీడియోలో మురిసిపోయింది జబర్దస్త్ నటి.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. దీంతో పలువురు బుల్లితెర సెలబ్రీటీలు, నెటిజన్లు కాబోయే జంటకు అభినందనలు, శుభాంకాంక్షలు తెలుపుతున్నారు. కాగా టీవీ యాంకర్‌గా పరిచయమైన సుజాత బిగ్‌బాస్‌ షోతో మరింత క్రేజ్‌ తెచ్చుకుంది. ప్రస్తుతం జబర్దస్త్‌ షోలో సందడి చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రముఖ కమెడియన్‌ రాకింగ్‌ రాకేష్‌ టీంతో కలిసి బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. ఈక్రమంలోనే రాకేష్‌తో ప్రేమలో పడిపోయింది. కాగా రీల్‌లైఫ్‌లోనే కాకుండా రియల్‌ లైఫ్‌లోనూ లవ్‌ ట్రాక్‌ నడిపిస్తూ వస్తోన్న ఈ జంట తమ ప్రేమ గురించి ఇప్పటికే చాలాసార్లు ఓపెన్‌ అయ్యారు. కాగా తాజాగా విడుదలైన జబర్దస్త్ ఎపిసోడ్‌ ప్రోమోలోనూ తమ పెళ్లిపై హింట్‌ ఇచ్చారు రాకేశ్‌- సుజాత. ఈ సందర్భంగా స్టేజిపైనే తన ప్రియురాలికి ఖరీదైన గిఫ్ట్‌ను ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశాడు రాకేశ్‌. ఆమెను హత్తుకుని, ముద్దులు పెడుతూ తన ప్రేమను చాటుకున్నాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Sujatha P (@jordarsujatha)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..