Chiranjeevi: వాల్తేరు వీరయ్య బ్లాక్‌ బస్టర్‌.. డైరెక్టర్‌ బాబీకి మెగాస్టార్‌ ఖరీదైన గిఫ్ట్‌!! ఏమిచ్చారో తెలుసా?

తన టేకింగ్‌తో మెగాభిమానుల్లో సరికొత్త జోష్‌ను తీసుకొచ్చిన డైరెక్టర్ బాబీ పనితనానికి చిరంజీవి కూడా ఫిదా అయ్యారట. సినిమా కోసం ప్రాణం పెట్టిన ఈ ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌కు మెగాస్టార్‌ మర్చిపోలేని కానుక ఇచ్చాడట.

Chiranjeevi: వాల్తేరు వీరయ్య బ్లాక్‌ బస్టర్‌.. డైరెక్టర్‌ బాబీకి మెగాస్టార్‌ ఖరీదైన గిఫ్ట్‌!! ఏమిచ్చారో తెలుసా?
Chiranjeevi, Bobby
Follow us
Basha Shek

|

Updated on: Jan 21, 2023 | 6:01 AM

ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఆచార్య ప్లాఫ్‌.. గాడ్‌ ఫాదర్‌కు సూపర్‌ హిట్ టాక్‌ వచ్చినా కలెక్షన్లలో దమ్ము చూపించలేకపోయింది. దీంతో మెగా ఫ్యాన్స్‌ ఢీలా పడిపోయారు. ఇలాంటి సందర్భంలో వాల్తేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్‌ చిరంజీవికి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సినిమాను అందించారు డైరెక్టర్‌ బాబీ. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బాస్టర్‌ టాక్‌తో దూసుకెళుతోంది. సంక్రాంతి సీజన్‌ అయిపోయినా వింటేజ్‌ చిరును మళ్లీ మళ్లీ చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లు పోటెత్తుతున్నారు. దీంతో కలెక్షన్లలో సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాడు వాల్తేరు వీరయ్య. ఇప్పటికే 120 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సంక్రాంతి విజేతగా నిలిచాడు. కాగా తన టేకింగ్‌తో మెగాభిమానుల్లో సరికొత్త జోష్‌ను తీసుకొచ్చిన డైరెక్టర్ బాబీ పనితనానికి చిరంజీవి కూడా ఫిదా అయ్యారట. సినిమా కోసం ప్రాణం పెట్టిన ఈ ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌కు మెగాస్టార్‌ మర్చిపోలేని కానుక ఇచ్చాడట. వాల్తేరు వీరయ్య హిట్‌ అయిన నేపథ్యంలో బాబీని ఇంటికి విందుకు పిలిచారట. భోజనం ముగిశాక అతనికి లగ్జరీ కారు కానుకగా ఇచ్చినట్లు ఫిల్మ్‌ సర్కిళ్లలో టాక్‌. దీని విలువ దాదాపు రెండు కోట్ల రూపాయల మేర ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో నిజం ఎంతో ఉందో తెలియదు కా నీ సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ తెగ చక్కర్లు కొదడుతుంది. అలాగే దీనికి సంబంధించిన ఫొటోలు కాని.. వీడియోలు కాని బయటకు రాలేదు. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే చిరంజీవి, బాబీలలో ఎవరో ఒకరు స్పందించేవరకు ఆగాల్సిందే మరి..

తండ్రి మరణాన్ని దిగమింగుకుని..

కాగా చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగిన బాబీ ఇప్పుడు ఆయనతోనే సినిమాను తీశారు. ఏకంగా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్నారు. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కాగా వాల్తేరు వీరయ్య సినిమా చిత్రీకరణలో భాగంగానే బాబీ తండ్రి కన్నుమూశారు. అయితే సినిమా ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో వాల్తేరు వీరయ్య చిత్రీకరణకు హాజరయ్యాడు. అనుకున్న సమయానికి చిత్రాన్ని పూర్తి చేసి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ విషయాన్ని మెగాస్టార్‌ చిరంజీవి స్వయంగా సినిమా ప్రమోషన్లలో భాగంగా బయటపెట్టారు. ఈనేపథ్యంలోనే బాబీ అంకితభావానికి మెచ్చి ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by RAVI TEJA (@raviteja_2628)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే