అందం, అమాయకత్వంతో బన్నీని ‘పరుగు’లు పెట్టించిన హీరోయిన్‌ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో ఏం చేస్తుందో తెలుసా?

Basha Shek

Basha Shek |

Updated on: Jan 22, 2023 | 6:05 AM

ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సుమారు 20కు పైగా సినిమాల్లో నటించిన షీల నవదీప్‌ సీతాకోక చిలుక సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. అల్లు అర్జున్‌ పరుగు సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత రాజుభాయ్‌, హలో ప్రేమిస్తారా, మస్కా, అదుర్స్‌ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది.

అందం, అమాయకత్వంతో బన్నీని 'పరుగు'లు పెట్టించిన హీరోయిన్‌ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో ఏం చేస్తుందో తెలుసా?
Actress Sheela

‘నమ్మవేమో కాని.. అందాల యువరాణి.. నేలపై వాలిందీ.. నా ముందే నిలిచింది’ అంటూ తన అందంతో బన్నీని తన వెంట ‘పరుగు’లు పెట్టించేలా చేసింది షీలా కౌర్‌. ఆ సినిమాలో అమయాకత్వంతో కూడిన ఆమె అభినయానికి కుర్రకారంతా ముగ్ధులయ్యారు. ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సుమారు 20కు పైగా సినిమాల్లో నటించిన షీల నవదీప్‌ సీతాకోక చిలుక సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. అల్లు అర్జున్‌ పరుగు సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత రాజుభాయ్‌, హలో ప్రేమిస్తారా, మస్కా, అదుర్స్‌ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మళయాల భాషల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకుల మెప్పుపొందింది. అయితే ఉన్నట్లుండి సినిమాలకు దూరమైంది. 2011లో బాలకృష్ణ ‘పరమీవర చక్ర’ సినిమా తర్వాత సిల్వర్‌స్ర్కీన్‌పై కనిపించలేదు. సోషల్‌ మీడియాలోనూ కనిపించలేదు. అయితే ఒకానొక సందర్భంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన షీలా బాగా బక్కచిక్కి గుర్తుపట్టలేనంతగా కనిపించింది. ఆతర్వాత షీలా కౌర్ క్యాన్సర్‌ మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డార‌ని అందుకే సడెన్ గా సినిమాల‌కు దూర‌మ‌య్యార‌ని వార్తలు వచ్చాయి. రహస్యంగానే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుని కోలుకున్నారని వదంతులు వచ్చాయి.

ఇదిలా ఉండగానే సుమారు మూడేళ్ల క్రితం మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది షీలా. 2020 మార్చిలో కేరళకు చెందిన వ్యాపారవేత్త సంతోష్‌రెడ్డితో కలిసి పెళ్లిపీటలెక్కిందీ అందాల తార. చెన్నైలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్‌గా ఈ వివాహ వేడుక జరిగింది. కాగా ప్రస్తుతం సినిమాలకు పూర్తి దూరంగా ఉన్న ఆమె భర్తతో కలిసి సూపర్ మార్కెట్ స్టోర్ నడుపుతోందట. క్యాన్సర్‌ బారిన పడిన తర్వాత సోషల్‌ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండిపోయిన షీలా ఇప్పుడు కూడా తన ఫొటోలు ఎవరితో కూడా షేర్ చేసుకోవడం లేదు.

Sheela Kaur

Sheela Kaur

ఇవి కూడా చదవండి

View this post on Instagram

A post shared by Sheela Kaur (@sheelaartist)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu