Shylashri: క్యాన్సర్‌తో ఆస్పత్రిలో చేరిన అలనాటి స్టార్ నటి.. చికిత్సకు చిల్లిగవ్వలేక దీన స్థితిలో..
న్నడ సినీ పరిశ్రమకు చెందిన ఈ ప్రముఖ నటి తమిళ, మలయాళ, తెలుగు భాషల్లోనూ సినిమాలు చేశారు. 1960-70 రోజుల్లో ప్రముఖ నటిగా పేరు సంపాదించింది. 1967లో బంగారు పువ్వు అనే చిత్రంలో రాజ్‌కుమార్‌తో కలసి కూడా నటించారామె.
ప్రముఖ సీనియర్ నటి షీలాశ్రీ గత కొన్ని రోజులుగా క్యాన్సర్ మహమ్మారితో బాధపడుతున్నారు. అయితే చికిత్స చేయించుకునేందుకు సరిపడా డబ్బులు లేకపోవడంతో దీన స్థితిలో జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు మళ్లీ పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేరారామె. బెంగళూరు ఆర్‌ఆర్ నగర్‌లోని క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే మందులు, ఇతర ఖర్చులకు డబ్బులు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలిసిన కొందరు దాతలు ఆమెకు ఆర్థికసాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటిని కలిసి చెక్‌ను అందజేశారు. తన పరిస్థితిని అర్థం చేసుకుని ఆర్థిక సాయం అందించినందుకు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు శైలా శ్రీ. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ఈ ప్రముఖ నటి తమిళ, మలయాళ, తెలుగు భాషల్లోనూ సినిమాలు చేశారు. 1960-70 రోజుల్లో ప్రముఖ నటిగా పేరు సంపాదించింది. 1967లో శైలశ్రీ ‘బంగారు పువ్వు’ చిత్రంలో రాజ్‌కుమార్‌తో కలసి నటించారు కూడా . సినిమా రంగంలో ఆమె చేసిన కృషికి 2019లో కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ అవార్డుతో సత్కరించింది.
ఇక 1971లో నేషనల్ అవార్డు గెలుచుకున్న కన్నడ చిత్రం నాగువా హూవులో శైలా శ్రీ పోషించిన పాత్ర ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. ఇక తెలుగులో భలే అబ్బాయిలు సినిమాలో నటించి మెప్పించారామె. కాగా తనతో పలు హిట్ సినిమాల్లో నటించిన కన్నడ యాక్టర్ ఆర్. ఎన్. సుదర్శన్‌ను వివాహం చేసుకున్నారు. అయితే ఆయన 2017 సెప్టెంబర్ నెలలో కిడ్నీ సమస్యలతో కన్నుమూశారు. అప్పటినుంచి షీలాశ్రీ ఒంటరిగానే జీవితం గడుపుతున్నారు. దీనికి తోడు క్యాన్సర్ మహమ్మారి సోకడంతో దీన స్థితిలో జీవితాన్ని వెల్లదీస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..