AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shah Rukh Khan : వన్స్ కింగ్.. ఆల్వేస్ కింగ్.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో చరిత్ర లిఖిస్తున్న షారుక్

విడుదలకు వారం ముందు నుంచే బాద్షా దూకుడు షురూ అయింది. మరి ఈ చిత్రంతో బాలీవుడ్‌కు మళ్లీ మంచి రోజులు వస్తాయా..? షారుక్ దెబ్బకు బాక్సాఫీస్ షేక్ అవ్వబోతుందా..?

Shah Rukh Khan : వన్స్ కింగ్.. ఆల్వేస్ కింగ్.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో చరిత్ర లిఖిస్తున్న షారుక్
Shahrukh Khan
Ram Naramaneni
|

Updated on: Jan 21, 2023 | 8:41 PM

Share

వన్స్ కింగ్.. ఆల్వేస్ కింగ్ అని ఊరికే అనలేదు. నాలుగేళ్లుగా సినిమాలు చేయట్లేదు.. దానికి ముందు చేసిన మూడు సినిమాలు డిజాస్టర్స్.. అయినా కూడా షారుక్ ఖాన్ పఠాన్ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే మెంటల్ వచ్చేస్తుంది.  బాలీవుడ్‌కు బ్యాడ్ టైమ్ నడుస్తుందిప్పుడు. ఒకప్పుడు ఒక్కరోజులోనే 100 కోట్లు కొట్టిన హీరోలు.. ఇప్పుడు లైఫ్ టైమ్ గ్రాస్ కూడా 100 కోట్లు దాటించలేకపోతున్నారు. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి స్టార్స్‌కు సైతం ఇలాంటి షాకులు తగిలాయి. కానీ కింగ్ ఖాన్ షారుక్ మాత్రం పఠాన్‌తో కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ సరికొత్త చరిత్రకు తెరతీస్తున్నాయి.

నాలుగేళ్ళ తర్వాత షారుక్ నటించిన సినిమా ఇది. 2018లో చివరగా జీరో సినిమాతో వచ్చారు కింగ్ ఖాన్. ఇన్నేళ్ళ తర్వాత 2023లో 3 సినిమాలతో రాబోతున్నారు. జనవరి 25న సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన పఠాన్ విడుదల కానుంది. దీని అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే 14 కోట్లు దాటిపోయాయి. కొన్ని చోట్ల కేజియఫ్ 2 రికార్డుల్ని తుడిచేసింది పఠాన్. బాద్షా దూకుడుకు తొలిరోజు రికార్డ్స్ గల్లంతయ్యేలా కనిపిస్తున్నాయి.

పఠాన్ టికెట్ రేట్స్ కూడా ఆకాశంలోనే ఉన్నాయి. ఢిల్లీలో కొన్ని మల్టీప్లెక్సుల్లో ఒక్కో టికెట్ 2100 రూపాయలుంటే.. ముంబైలో 1450.. బెంగళూరులో 800.. కోల్‌కత్తాలో 700 రూపాయల వరకు ఉన్నాయి. అక్కడ మినిమమ్ టికెట్ 300 నుంచి మొదలవుతుంది. అయినా కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతున్నాయి. మొత్తానికి చూడాలిక.. పఠాన్‌తో షారుక్ కమ్ బ్యాక్ ఇస్తారో లేదో..? చూడాలి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
వైద్యం కావాలని వచ్చి కత్తులతో నరికి చంపేశారు.. ఎక్కడంటే
వైద్యం కావాలని వచ్చి కత్తులతో నరికి చంపేశారు.. ఎక్కడంటే
హైదరాబాద్‌లో తొలిసారిగా డబుల్ డెక్కర్ కారిడార్.. ఎక్కడంటే..?
హైదరాబాద్‌లో తొలిసారిగా డబుల్ డెక్కర్ కారిడార్.. ఎక్కడంటే..?
ఉన్నట్లుండి భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ఇప్పుడు ఎంతంటే..?
ఉన్నట్లుండి భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ఇప్పుడు ఎంతంటే..?
రెడ్‌ డ్రెస్‌లో అదిరిపోయిన బెబో లుక్
రెడ్‌ డ్రెస్‌లో అదిరిపోయిన బెబో లుక్
ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఏఎస్ఐ లీలలు.. అప్పట్లోనే..
ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఏఎస్ఐ లీలలు.. అప్పట్లోనే..
పాండ్యా బ్రదర్స్ మధ్య ముదిరిన విబేధాలు? .. సాక్ష్యం ఇదే
పాండ్యా బ్రదర్స్ మధ్య ముదిరిన విబేధాలు? .. సాక్ష్యం ఇదే
ఉదయాన్నే టిఫిన్ బదులు ఇది తిని చూడండి.. దెబ్బకు బాడీ కూల్‌
ఉదయాన్నే టిఫిన్ బదులు ఇది తిని చూడండి.. దెబ్బకు బాడీ కూల్‌
ఊరికి కొత్త.. రెస్టారెంట్‌ అనుకుని చావు ఇంటికి వెళ్లిన పర్యాటకులు
ఊరికి కొత్త.. రెస్టారెంట్‌ అనుకుని చావు ఇంటికి వెళ్లిన పర్యాటకులు
వామ్మో.. కండలు తిరిగిన బాడీతో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్.
వామ్మో.. కండలు తిరిగిన బాడీతో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్.
ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్ టిమ్ డేవిడ్‌కు షాక్
ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్ టిమ్ డేవిడ్‌కు షాక్