Balakrishna: వీరమాస్‌ బ్లాక్‌బస్టర్‌.. స్టేజ్‌పై పాట పాడిన బాలయ్య.. పూనకాలతో ఊగిపోయిన ఫ్యాన్స్‌.. వీడియో చూశారా?

ఈ కార్యక్రమంలో బాలయ్య మరోసారి తన గొంతును సవరించుకున్నారు. తాను నటించిన మాతో పెట్టుకోకు సినిమాలోని ‘మాఘమాసం లగ్గం పెట్టిస్తా..’ పాటను స్టేజ్‌పై ఆలపించి అభిమానులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా అభిమానులు ఈలలు, కేకలతో వేదికను హోరెత్తించారు.

Balakrishna: వీరమాస్‌ బ్లాక్‌బస్టర్‌.. స్టేజ్‌పై పాట పాడిన బాలయ్య.. పూనకాలతో ఊగిపోయిన ఫ్యాన్స్‌.. వీడియో చూశారా?
Balakrishna
Follow us
Basha Shek

|

Updated on: Jan 23, 2023 | 5:45 AM

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్‌ మలినేని తెరకెక్కించిన చిత్రం వీర సింహారెడ్డి. శ్రుతిహాసన్‌ కథానాయిక. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, హనీరోజ్‌ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన పవర్‌ఫుల్ మాస్‌ ఎంటర్‌టైనర్‌ సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పటికే రూ.110 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు. కాగా సినిమా విజయాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. సినిమా యూనిట్ సభ్యులందరూ ఈ వేడుకలో సందడి చేశారు. అలాగే యంగ్ హీరోలు విశ్వక్‌సేన్‌, సిద్ధూ జొన్నలగడ్డ, డైరెక్టర్లు హరీశ్‌ శంకర్‌, అనిల్‌ రావిపూడి, రాహుల్‌ సాంకృత్యాన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాలయ్య మరోసారి తన గొంతును సవరించుకున్నారు. తాను నటించిన మాతో పెట్టుకోకు సినిమాలోని ‘మాఘమాసం లగ్గం పెట్టిస్తా..’ పాటను స్టేజ్‌పై ఆలపించి అభిమానులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా అభిమానులు ఈలలు, కేకలతో వేదికను హోరెత్తించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా ఈ ఈవెంట్‌లో మాట్లాడిన బాలయ్య వీరసింహారెడ్డి ఫ్యాక్షన్‌ కథ కాదని, ఇదొక అద్భుత ప్రయాణమన్నారు. ‘ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో గోపిచంద్ మలినేని అద్భుతమైన సినిమా అందించారు. ఇది కథ కాదు, ఇదొక ప్రయాణం. తెలుగు ప్రేక్షకులతోపాటు, ఇతర భాషలకు చెందిన అభిమానులు కూడా ఈ సినిమా బాగుందని మెచ్చుకుంటున్నారు. ఈ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని మూవీ యూనిట్‌ను ప్రశంసించారు బాలయ్య.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..