Nithiin: అంజనేయస్వామి స్వామి దీక్షలో యూత్‌ స్టార్‌.. సరికొత్త లుక్‌లో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన నితిన్

యూత్‌స్టార్‌ హీరో నితిన్‌ మళ్లీ ఆంజనేయస్వామి దీక్షకు పూనుకున్నాడు. ఈ మేరకు కాషాయ రంగు దుస్తుల్లో కనిపించి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఈవిషయాన్ని ఆయనే సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు తెలియజేశాడు, అంత‌కు ముందు ఆయ‌న భీష్మ సినిమా స‌మ‌యంలో హనుమాన్‌ దీక్ష తీసుకున్నారు.

Nithiin: అంజనేయస్వామి స్వామి దీక్షలో యూత్‌ స్టార్‌.. సరికొత్త లుక్‌లో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన నితిన్
Hero Nithiin
Follow us
Basha Shek

|

Updated on: Jan 23, 2023 | 6:06 AM

యూత్‌స్టార్‌ హీరో నితిన్‌ మళ్లీ ఆంజనేయస్వామి దీక్షకు పూనుకున్నాడు. ఈ మేరకు కాషాయ రంగు దుస్తుల్లో కనిపించి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఈవిషయాన్ని ఆయనే సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు తెలియజేశాడు, అంత‌కు ముందు ఆయ‌న భీష్మ సినిమా స‌మ‌యంలో హనుమాన్‌ దీక్ష తీసుకున్నారు. కాగా 8 దశాబ్దాలుగా విజయవాడ నగర వాసులకు రుచికరమైన భోజనాన్ని అందిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను గుర్తింపు తెచ్చుకుంది బాబాయ్‌ హోట్‌. తాజాగా హైదరాబాద్‌లో బాబాయ్ హోటల్ బ్రాంచ్‌ను నితిన్‌ చేతుల మీదుగా మణికొండలో ప్రారంభించారు. డైరెక్టర్ శశికాంత్ తన స్నేహితులతో కలిసి ఫ్రెండ్స్ ఫ్యాక్టరీని స్థాపించారు. ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ పేరు మీదే ఈ బాబాయ్ హోటల్‌ను హైదరాబాద్‌లోని మణికొండలో ప్రారంభించారు. ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి, డైరెక్టర్ వెంకీ కుడుముల, రామ జోగయ్య శాస్త్రి, రచయిత దర్శకుడు వక్కంతం వంశీ, నిర్మాత ఠాగూర్ మధు తదితరులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు.

భీష్మ తర్వాత తన స్థాయికి తగ్గ హిట్‌ను సాధించలేకపోతున్నాడు నితిన్‌. ఈ సినిమా తర్వాత అతను నటించిన చెక్‌, రంగ్‌దే, మ్యాస్ట్రో, మాచెర్ల నియోజకవర్గం చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి. ప్రస్తుతం ఆయన వక్కంతం వంశీతో జతకట్టారు. అల్లు అర్జున్‌’ నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ తో డైరెక్టర్‌గా మారిన ఈ రైటర్‌ నితిన్‌ను మళ్లీ గెలుపు బాట పట్టిస్తాడని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా ఈ సినిమా తర్వాత మరోసారి వెంకీ కుడుముల దర్శకత్వంలో నటించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా బాబాయ్‌ హోటల్ ప్రారంభోత్సవంలో వెంకీ కుడుమలతో కనిపించడం ఈ క్రేజీ కాంబినేషన్‌కు మరింత బలాన్ని చేకూర్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?