AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యపై ప్రేమకు ప్రతిరూపం ఈ అద్భుతమైన పాట.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న తెలుగోడి ఫోక్‌ సాంగ్‌

రీసెంట్ గా రిలీజ్ అయిన అలాంటి ఓ పాటే ఇప్పుడు అందరి నోళ్లలో నానుతోంది. అందరి హృదయాలను ద్రవింపజేస్తోంది. అదే 'ఏ తోడు లేని నా బతుకులో'! ఎస్ ! లవ్‌ ఫెయిల్యూర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్లో వైరల్ అవుతోంది. అందరి నోటా వినిపిస్తోంది.

భార్యపై ప్రేమకు ప్రతిరూపం ఈ అద్భుతమైన పాట.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న తెలుగోడి ఫోక్‌ సాంగ్‌
Telugu Folk Song
Basha Shek
| Edited By: |

Updated on: Jan 24, 2023 | 6:30 PM

Share

జానపదం అంటేనే జన పదం! జనాల్లోంచి.. వాళ్ల భావోద్వేగాల నంచి పుట్టిన పదం! అలాంటి పదాలను ఏరి కోరి.. కూర్చి మరీ శ్రావ్యంగా.. పాడుకోవడమనేది తెలంగాణ పల్లెల్లో నిత్య కృత్యం. అదే వారి మసులోని భారాన్ని దించుకునే మార్గం. అలా పుట్టిన జానపదం.. అప్పట్లో అందర్నీ విపరీతంగా అలరించింది. ఈ జమానాలో మరో సారి అందరి పాటగా మారింది. యూట్యూబ్‌ పుణ్యాన ఎక్కడ పడితే అక్కడ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన అలాంటి ఓ పాటే ఇప్పుడు అందరి నోళ్లలో నానుతోంది. అందరి హృదయాలను ద్రవింపజేస్తోంది. అదే ‘ఏ తోడు లేని నా బతుకులో’! ఎస్ ! లవ్‌ ఫెయిల్యూర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్లో వైరల్ అవుతోంది. అందరి నోటా వినిపిస్తోంది. ఇప్పటికే దాదాపు లక్షకు పైగా వ్యూస్‌ను రాబట్టింది. సోషల్ మీడియాలో రీల్స్‌ గా తెగ తిరుగుతోంది. ఇక ఈ పాట.. పాట మాత్రమే కాదు.. నిజ జీవిత కథ అనే నిజం ఇప్పుడు అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది. ఎందుకంటే.. ఈ పాట ఈ లోకంలో లేని తన భార్య కోసం ఓ భర్త చేసిన పాట కనుక. తనను మరిచిపోలేక ఆమెకిచ్చిన ఓ కానుక కనుక! తన ప్రేమ గురించి మనందరికీ చెప్పాలనే ప్రయత్నమే ఈ పాట కనుక!

ఈ పాటకు రూపకర్త నవీన్. ములుగు నేటివ్ ప్లేస్. ఈయన ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య శిల్ప.. న్యూరో ప్రాబ్లమ్‌తో హాస్పిటల్ పాలైంది. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకే తనను వదిలి వెళ్లిపోయింది. దీంతో ఆమె గుర్తుగా ఏదోటి చేయాలనుకున్న నవీన్.. తన ప్రేమ, వివాహబంధానికి గుర్తుగా..! తనను విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన తన భార్య శిల్ప సాక్షిగా..! తన మనసులోని బాధకు ప్రతిరూపంగా..! ఈ పాటను రూపొందిచాడు. ఎంతో అందంగా ఈ పాటను మలిచి తన భార్యకు డెడికేట్ చేశాడు. ఇప్పుడు అందరి నోట.. మాటగా పాడుకునే పాటగా మారాడు. తన భార్యపై ఉన్న అన్‌ కండీషనల్ లవ్‌తో.. ఇప్పుడు అందరి చేత సలాం కొట్టించుకుంటున్నాడు.

ఇవి కూడా చదవండి