Mohammed Shami: టీమిండియా క్రికెటర్‌కు షాక్ . భరణం చెల్లించాలని షమీని ఆదేశించిన కోర్టు.. ప్రతి నెలా ఎంతంటే?

కోర్టు ఆదేశాల మేరకు క్రికెటర్ మహ్మద్ షమీ తన భార్య హసిన్ జహాన్‌కు నెలవారీ భరణం రూ.1 లక్ష 30 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అందులో రూ.50,000లను హసిన్ జహాన్ కు వ్యక్తిగత భరణంగా.. ఆమెతో పాటు ఉంటున్న కుమార్తె పోషణకు రూ.80 వేలు ఖర్చు చేయాలని ఆదేశించింది.

Mohammed Shami: టీమిండియా క్రికెటర్‌కు షాక్ . భరణం చెల్లించాలని షమీని ఆదేశించిన కోర్టు.. ప్రతి నెలా ఎంతంటే?
Mohammed Shami
Follow us
Basha Shek

|

Updated on: Jan 24, 2023 | 7:10 AM

టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్ షమీ, అతని సతీమణి హసిన్ జహాన్ మధ్య ఐదేళ్లుగా సాగుతున్న న్యాయ పోరాటం ఓ కొలిక్కి వచ్చింది. ఈ వ్యవహారంలోఅలీపూర్ జిల్లా కోర్టు షమీ భార్య హసిన్ జహాన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు క్రికెటర్ మహ్మద్ షమీ తన భార్య హసిన్ జహాన్‌కు నెలవారీ భరణం రూ.1 లక్ష 30 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అందులో రూ.50,000లను హసిన్ జహాన్ కు వ్యక్తిగత భరణంగా.. ఆమెతో పాటు ఉంటున్న కుమార్తె పోషణకు రూ.80 వేలు ఖర్చు చేయాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే 2018 ఆగస్టు 16న మహ్మద్ షమీ వేధిస్తున్నాడంటూ అతని భార్య హసిన్ జహాన్ భార్య కోర్టును ఆశ్రయించింది. దీంతో షమీపై దాడి, అత్యాచారం, హత్యాయత్నం, గృహహింస తదితర అభియోగాలపై కేసు నమోదైంది. అదే సమయంలో, హసిన్ జహాన్ తన కుమార్తె ఖర్చులకు ఎలాంటి ఆర్థిక సహాయం అందించడం లేదని ఫిర్యాదులో ఆరోపించింది. తన కుమార్తె పోషణకు గానూ నెలకు రూ.10 లక్షలు అందించేలా చూడాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు ఈ అంశంపై తీర్పునిచ్చిన కోర్టు.. హసిన్ జహాన్ డిమాండ్‌ను తిరస్కరించింది. షమీ వార్షిక ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రతినెలా భరణం చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు అదనపు జిల్లా జడ్జి అనిందితా గంగూలీ తీర్పును వెలువరించారు.

కాగా 2014లో పెళ్లి చేసుకున్న మహ్మద్ షమీ, హసిన్ జహాన్ దంపతులకు ఓ కూతురు ఉంది. అయితే ఉన్నట్లుండి ఈ దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈక్రమంలో 2018లో షమీపై గృహ హింస, దాడి, వరకట్న వేధింపులు, క్రికెట్ ఫిక్సింగ్ వంటి అనేక తీవ్రమైన ఆరోపణలు చేసింది హసిన్‌. అయితే తన భార్య చేసిన ఆరోపణలన్నింటినీ మహ్మద్ షమీ ఖండించాడు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. అయితే విడాకులు మాత్రం తీసుకోలేదు. కాగా ఫిక్సింగ్‌కు సంబంధించి బీసీసీఐ విచారణలో షమీకి క్లీన్‌చిట్‌ వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..