AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreevani: లగ్జరీ కారు కొని నాన్‌వెజ్‌ వంటకాలతో దావత్ ఇచ్చిన బుల్లితెర నటి.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు

ప్రముఖ బుల్లితెర నటి శ్రీవాణి గురించి పెద్దగా పరిచయం లేదు. కలవారి కోడలు, మనసు మమత, కాంచన గంగ, చంద్రముఖి తదితర హిట్‌ సీరియల్స్‌లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైందామె.

Sreevani: లగ్జరీ కారు కొని నాన్‌వెజ్‌ వంటకాలతో దావత్ ఇచ్చిన బుల్లితెర నటి.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు
Actress Sreevani
Basha Shek
|

Updated on: Jan 25, 2023 | 12:34 PM

Share

ప్రముఖ బుల్లితెర నటి శ్రీవాణి గురించి పెద్దగా పరిచయం లేదు. కలవారి కోడలు, మనసు మమత, కాంచన గంగ, చంద్రముఖి తదితర హిట్‌ సీరియల్స్‌లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైందామె. ఎక్కువగా లేడీ విలన్‌గా నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం టీవీ షోల్లోనూ పాల్గొంటోంది. ఇక సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉండే ఈ ట్యాలెంటెడ్‌ నటి సొంతంగా యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తోంది. అందులో తన ప్రొఫెషనల్‌ విషయాలతో పాట తన వ్యక్తిగత విషయాలను, ఇంట్లో జరిగే శుభకార్యలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తరచూ షేర్‌ చేస్తుంటుంది. తన భర్త విక్రమాదిత్య, కూతురు నందినీ కూడా ఈ వీడియోల్లో కనిపిస్తుంటారు. శ్రీవాణి షేర్‌ చేసే వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన ఉంటుంది. తన యూట్యూబ్‌కు 6 లక్షలకు పైగానే సబ్ స్క్రైబర్స్ ఉన్నారంటే ఆమె వీడియోలకు ఎంత క్రేజ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా ఇటీవల కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన శ్రీవాణి దంపతులు తాజాగా లగ్జరీ కారు కొనుగోలు చేశారు. తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా ఆమె ఈ విషయాన్ని పంచుకున్నారు.

షోరూంలో కారు కొన్న అనంతరం దానికి ప్రత్యేక పూజలు చేయించింది శ్రీవాణి. అనంతరం తన సహ నటీనటులకు, స్నేహితులకు, సన్నిహితులకు నాన్‌వెజ్‌ వంటకాలతో కూడిన దావత్‌ (విందు)ను ఇచ్చింది. అనంతరం దీనికి సంబంధించిన ఫుల్‌ వీడియోను ‘కారు కొన్నా.. దావత్‌ ఇచ్చినాం’ అంటూ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఇక దావత్‌ పార్టీలో హిమజతో పాటు పలువురు టీవీ నటులు సందడి చేశారు. కాగా శ్రీవాణి కొన్న మారుతి గ్రాండ్‌ విటారా ధర రూ. 13 లక్షలపైగానే ఉంటుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Strikers (@strikersinsta)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..