Bigg Boss Telugu: సీజన్ 7 గురించి సూపర్ అప్‌డేట్.. హోస్ట్‌గా ఆ యంగ్ హీరో.. కంటెస్టెంట్‌గా నందమూరి హీరో

అప్పుడే సీజన్ 7పై అంచనాలు మొదలయ్యాయి. కంటెస్టెంట్స్‌గా ఎవరిని తీసుకుంటారు అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ వివరాలు మీ కోసం...

Bigg Boss Telugu: సీజన్ 7 గురించి సూపర్ అప్‌డేట్.. హోస్ట్‌గా ఆ యంగ్ హీరో.. కంటెస్టెంట్‌గా నందమూరి హీరో
Bigg Boss Telugu 7
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 25, 2023 | 12:22 PM

బిగ్ బాస్ షో తెలుగునాట మస్త్ క్లిక్ అయిన విషయం తెలిసిందే. ప్రతి సంవత్సరం ఈ షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందులో తమ మనస్తత్వాలను పోలి ఉన్నవాళ్లను ఓన్ చేసుకుని.. వారికి మద్దతుగా నిలుస్తారు. అయితే సీజన్ 6 మాత్రం కాస్త రోత పుట్టించిందనే చెప్పాలి. షోను ఎంతో ఇష్టపడేవాళ్లు సైతం సీజన్ 6పై పెదవి విరిచారు. కంటెస్టెంట్స్ సెలక్షన్స్ దగ్గర్నుంచి చాలా విషయాల్లో ఫెయిల్ అయ్యారు నిర్వాహకులు. సీజన్ 6 గత ఏడాది డిసెంబర్ 17న ముగిసింది. LV రేవంత్ ట్రోఫీని గెలుచుకున్నాడు. శ్రీహాన్ మొదటి రన్నరప్‌గా ఇంటిదారి పట్టాడు.

బిగ్ బాస్ తెలుగు 6 ముగిసి నెల దాటింది అంతే. అప్పుడే  కొత్త సీజన్ గురించి ప్రతిదీ తెలుసుకోవడానికి అభిమానులు ఇప్పటికే ఆసక్తిగా ఉన్నారు. బిగ్ బాస్ తెలుగు ఏడవ సీజన్ ఈసారి కాస్త ముందుగా ప్రసారం కానుందని వార్తలు వెలువడుతున్నాయి. మాములుగా అయితే ప్రతి ఏటా సెప్టెంబర్‌లో సీజన్ ప్రారంభమవుతుంది. తాజా ఈసారి ఓటీటీ సీజన్ లేనందున.. 2023 జూలై నెలలో బిగ్ బాస్ తెలుగు 7 ప్రీమియర్ అవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇన్ని ఉత్కంఠల మధ్య అక్కినేని నాగార్జున ఈ షోలో కనిపించడం లేదంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఆ విషయం నిజమేనట. కిక్కిచ్చే న్యూస్ ఏంటంటే.. దగ్గుబాటి రానా ఈసారి సీజన్ హోస్ట్ చేయనున్నారట.

అంతేకాదు ఇప్పటివరకు జరిగిన సీజన్లలో అత్యంత ప్రజాదరణ పొందిన పాత కంటెస్టెంట్లు బిగ్ బాస్ తెలుగు ఏడవ సీజన్‌లో భాగంగా కానున్నారట. కాగా ఈసారి నందమూరి హీరో తారక రత్న ఓ కంటెస్టెంట్‌గా రానున్నారట. సినిమాల్లో పెద్దగా సత్తా చాటలేకపోతున్న ఈయన.. ఇటీవల పాలిటిక్స్‌లో యాక్టివ్ అయ్యారు. ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నంలో.. ఈ సారి బిగ్ బాస్ సీజన్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.

Tarakaratna

Tarakaratna

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..