Anasuya Bharadwaj: రూటు మార్చిన అనసూయ.. వేటకూరకు అలవాటు పడ్డాక తోటకూరేం నచ్చుతుంది?

బుల్లితెరపై యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించిన అనసూయ వెండితెరపై వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. రంగస్థలం మువీలో రంగమ్మత్తగా అలరించిన అనసూయ పుష్ప సినిమాతో విలన్‌ అవతారం ఎత్తింది..

Anasuya Bharadwaj: రూటు మార్చిన అనసూయ.. వేటకూరకు అలవాటు పడ్డాక తోటకూరేం నచ్చుతుంది?
Anasuya Bharadwaj
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 26, 2023 | 2:20 PM

బుల్లితెరపై యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించిన అనసూయ వెండితెరపై వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. రంగస్థలం మువీలో రంగమ్మత్తగా అలరించిన అనసూయ పుష్ప సినిమాతో విలన్‌ అవతారం ఎత్తింది. సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌, రష్మిక మందన్న జంటగా పుష్ప 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పుష్ప తొలి భాగంలో డీగ్లామర్‌ లుక్‌లో దాక్షాయని పాత్రలో నటించిన అనసూయ రెడ్ శాండిల్ స్మగ్లర్ భార్యగా ప్రేక్షకుల మెప్పుపొందింది. ఇక రెండో భాగంలోనూ బ్యాడ్ గర్ల్ పాత్రలో కనిపించనుంది. ఎంతో సుకుమారంగా ఉండే అనసూయ ఈమేనా అనేంతగా పుష్ప మువీలో కనిపించింది. దర్జా సినిమాలో కూడా అదే తీరు. జనాన్ని భయపెట్టే లేడీ గ్యాంగ్ స్టర్ రోల్‌లో అనసూయ కనిపించడం ప్రేక్షకులకు కూడా కొంత కొత్త అనుభూతిని కలిగించినట్టుంది.

రవితేజ హీరోగా నటించిన ఖిలాడీ మువీలో అనసూయ ట్రాన్స్ఫర్మేషక్‌కి దిమ్మ తిరిగినంత పనైంది. షార్ట్ ఫ్రాక్‌లో రవితేజ క్రైమ్ పార్టనర్‌గా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించింది. తాజాగా మైఖేల్ మూవీ టీజర్ విడుదలైంది. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీలో అనసూయ సీరియల్ రోల్ చేస్తున్నారు. ఇందులోనూ ఆమెది నెగిటివ్ రోలే. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో అనసూయ దేవదాసిగా కనిపించనున్నట్లు సమాచారం.

ఇదే కోవలో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలే వరుస కడుతున్నాయి అమ్మడుకి. సిల్వర్ స్క్రీన్ ఆఫర్స్ ఇబ్బడిముబ్బడిగా వరుస కట్టడంతో బుల్లితెరపై కనిపించే అవకాశం ఇప్పట్లో లేనట్టుగానే ఉంది. అనసూయ జోరు చూడబోతే త్వరలో వరలక్ష్మి శరత్ కుమార్‌ని బీట్ చేసి లేడీ విలన్‌గా సెటిల్ అవుతుందేమోనని టాక్‌..!

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.