Prisoners Missing: ధగా..ధగా..! కరోనా టైంలో పెరోల్‌పై జైళ్ల నుంచి విడుదలైన 451 ఖైదీలు పరార్‌..

కోవిడ్ మహమ్మారి సమయంలో రాష్ట్ర జైళ్ల నుంచి పెరోల్‌పై విడుదలైన ఖైదీల్లో దాదాపు 451 మంది పరారయ్యారు. గత మే నెల నుంచి గడచిన ఏడు నెలల్లో పరారైన ఖైదీలపై..

Prisoners Missing: ధగా..ధగా..! కరోనా టైంలో పెరోల్‌పై జైళ్ల నుంచి విడుదలైన 451 ఖైదీలు పరార్‌..
Prisoners Missing
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 24, 2023 | 7:19 PM

కోవిడ్ మహమ్మారి సమయంలో మహారాష్ట్ర జైళ్ల నుంచి పెరోల్‌పై విడుదలైన ఖైదీల్లో దాదాపు 451 మంది పరారయ్యారు. గత మే నెల నుంచి గడచిన ఏడు నెలల్లో పరారైన ఖైదీలపై 357 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. కాగా దేశంలో కరోనా ఉధృతి అధికంగా ఉన్న టైంలో జైళ్లలో కరోనా కేసులు పెరుగుతున్నందున.. ఏడేళ్లు అంతకన్నా తక్కువ కాలం శిక్ష అనుభవిస్తున్న కేసుల్లో దోషులను విడుదల చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 2020 నాటికి మహారాష్ట్ర జైళ్లలో 35 వేలకు పైగా ఖైదీలు ఉన్నారు.

వీరిలో కరోనా కారణంగా 14,780 మంది ఖైదీలను ఎమర్జెన్సీ పెరోల్‌పై విడుదల చేశారు. నిర్ణీత గుడువ అనంతరం అనంతరం తిరిగి జైలుకు రావాలని అధికారులు సూచించారు. ఐతే పెరోల్‌ గడువు ముగిసినా విడుదలైన ఖైదీల్లో చాలా మంది తిరిగి జైళ్లకు రాలేదు. పరారీలో ఉన్నవారందరూ ఎక్కడ తలదాచుకున్నారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. వీరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.