Disposable Paper Cups: పేపర్ కప్పుల్లో టీ తాగుతున్నారా..? ఈ విషయం తెలిస్తే ఎప్పటికీ ముట్టుకోరు..

కొంతమందికి వేడివేడిగా టీ, కాఫీ తాగందే రోజు గడవదు. ఆఫీస్‌లో, రోడ్డు పక్కన బడ్డీకొట్టు ఎక్కడ పడితే అక్కడ టీ రుచులను ఆస్వాదిస్తుంటారు. గతంలో టీ, కాఫీలను గాజు గ్లాసుల్లో ఇచ్చేవారు. కాలంమారేకొద్దీ వాటి స్థానంలో..

Disposable Paper Cups: పేపర్ కప్పుల్లో టీ తాగుతున్నారా..? ఈ విషయం తెలిస్తే ఎప్పటికీ ముట్టుకోరు..
Paper Cups
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 24, 2023 | 4:54 PM

కొంతమందికి వేడివేడిగా టీ, కాఫీ తాగందే రోజు గడవదు. ఆఫీస్‌లో, రోడ్డు పక్కన బడ్డీకొట్టు ఎక్కడ పడితే అక్కడ టీ రుచులను ఆస్వాదిస్తుంటారు. గతంలో టీ, కాఫీలను గాజు గ్లాసుల్లో ఇచ్చేవారు. కాలంమారేకొద్దీ వాటి స్థానంలో డిస్పోజబుల్‌ పేపర్ గ్లాసులు వచ్చాయి. నేటి కాలంలో అనేక మంది టీ తాగడానికి పేపర్ కప్పులను వినియోగిస్తూంటారు. నిజానికి.. పేపర్ కప్పుల్లో టీ లేదా ఇతర వేడి ద్రావణాలు తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయనే విషయం ఖరగ్‌పూర్‌ ఐఐటీ  తాజా అధ్యయనాల్లో బయటపడింది. పేపర్ కప్పుల్లో రోజుకు మూడు సార్లు 100 మిల్లీలీటర్ల చొప్పున వేడి వేడి టీ తాగితే.. 75 వేల హానికర మైక్రో ప్లాస్టిక్ కణాలు శరీరంలోకి ప్రవేశిస్తాయని వెల్లడించారు. ఈ విధంగా శరీరంలోకి చేరే ప్లాస్టిక్‌ క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాలకు కారణమవుతుందని అధ్యయనంలో తేలింది.

సాధారణంగా పేపర్ కప్పు హైడ్రో ఫోబిక్ ఫిల్మ్ పొరతో తయారు చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇతర పదార్థాలతో కూడా పేపర్ కప్పులు తయారవుతాయి. టీ వంటి వేడి ద్రవాలను పేపర్ కప్పులలో పోయగానే దానిలో ఉండే ప్లాస్టిక్ పొర సులభంగా కలిసిపోయి టీ ద్వారా శరీరంలోకి చేరుతుంది. అందువల్లనే వీలైనంత వరకు పేపర్ కప్పులలో టీ, కాఫీలు తాగడానికి దూరంగా ఉండాలని, సాధ్యమైనంత వరకు స్టీల్, గాజు గ్లాసులను వినియోగిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.