Overeating: ఇలా చేస్తే ఎంత తిన్నా ఆహారం ఇట్టే అరిగిపోతుంది.. అజీర్తి సమస్య రానే రాదు.. 

రోజూ తినేదానికన్నా ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉంటాం. తిన్నప్పుడు బాగానే ఉంటుంది గానీ, ఆ తర్వాత అసలు సమస్య ప్రారంభమవుతుంది. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. మరీ అలాంటి సమస్యలను ఎలా ఎదుర్కొవాలి?

Overeating: ఇలా చేస్తే ఎంత తిన్నా ఆహారం ఇట్టే అరిగిపోతుంది.. అజీర్తి సమస్య రానే రాదు.. 
Overeating
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 24, 2023 | 7:17 PM

ఒక్కోసారి మన జిహ్వను మనం అదుపు చేసుకోలేం.. ఇష్టమైన ఆహారం కనిపించినా.. లేదా ఏదైనా పెళ్లి వంటి ఫంక్షన్ కు వెళ్లినప్పుడు నచ్చిన పదార్థాలు ఉంటే మన నాలుకను కంట్రోల్ చేయలేం. అలాంటి సమయంలో కాస్త ఎక్కువ ఆహారం కూడా తీసుకుంటూ ఉంటాం. రోజూ తినేదానికన్నా ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉంటాం. తిన్నప్పుడు బాగానే ఉంటుంది గానీ, ఆ తర్వాత అసలు సమస్య ప్రారంభమవుతుంది. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. మరీ అలాంటి సమస్యలను ఎలా ఎదుర్కొవాలి? ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఎటువంటి చిట్కాలు ఫాలో అవ్వాలి ? నిపుణులు చెబుతున్న ఇంటి చిట్కాలు ఇప్పుడు చూద్దాం..

గోరువెచ్చని నీరు.. మీరు ఆహారం ఎక్కువగా తీసుకొన్న సమయంలో దానిని సక్రమంగా అరిగించడానికి గోరువెచ్చని నీరు బాగా ఉపయోగపడుతుంది. భోజనం తిన్నతర్వాత గోరువెచ్చని నీరు తీసుకోవాలి. ఇది జీర్ణ క్రియను ప్రోత్సహిస్తుంది.

హెర్బల్ టీ , సుగంధ ద్రవ్యాలు.. బాగా తిన్న తర్వాత జీర్ణక్రియను వేగవంతం చేయడంలో మూలికలు, సుగంధ ద్రవ్యాలు ఉపయోగపడతాయి. అజ్వైన్, జీరా వంటి మసాలా దినుసులు జీర్ణక్రియకు సహాయపడతాయి. దీని కోసం కేవలం ఒక గ్లాసు నీటిలో అవసరమైన మసాలాలను మరిగించి తీసుకోవచ్చు. అలాగే గ్రీన్ టీ, అల్లం టీ, చమోమిలే టీ వంటి హెర్బల్ టీలు కూడా జీర్ణశక్తిని పెంచుతాయి.

ఇవి కూడా చదవండి

తక్కువగా తీసుకోండి.. ఈ రోజు మధ్యాహ్నం బాగా భోజనం చేస్తే.. తర్వాత చేసే భోజనాన్ని లైట్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మోతాదులో ఎక్కువగా తీసుకున్నప్పుపడు జీర్ణ వ్యవస్థపై అధిక భారం పడుతుంది. కాబట్టి, తర్వాత తీసుకునే ఆహారం లైట్ గా ఉంటే వ్యవస్థకు రిలీఫ్ గా ఉంటుంది.

ఫైబర్‌ ఎక్కువగా.. ఫైబర్ అనేది ప్రేగుల కదలికకు మద్దతునిచ్చే, ఆరోగ్యకరమైన జీర్ణక్రియను నిర్వహించడానికి సహాయపడే అద్భుతమైన పదార్థం. ఎక్కువ ఆహారం తీసుకున్న తర్వాత మీరు మీ ఆహారంలో ఎంత ఎక్కువ ఫైబర్ జోడిస్తే, జీర్ణ సంబంధిత సమస్యలను అంత దూరం చేసినవారు అవుతారు. పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకుంటే మంచింది.

నడక మంచిది.. ప్రతి రోజూ వ్యాయామం, వాకింగ్ ఆరోగ్యానికి మేలు చేస్తోంది. మీరు ఎక్కువ ఆహారం తీసుకున్నప్పుడు కూడా 15 నుంచి 20 నిమిషాల పాటు నడిస్తే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. తిన్న వెంటనే పడుకోకుండా కాసేపు నడవడం మంచిది.

పులియబెట్టిన ఆహారాలు.. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో పులియబెట్టిన ఆహారాలు బాగా ఉపకరిస్తాయి. అందుకే ఆహారం చివరలో పెరుగును తీసుకోవడం చాలా మంది చూస్తూ ఉన్నాం. ఎక్కువ ఆహారం తీసుకున్న తర్వాత మళ్లీ మరో సెషన్ లో భోజనం చేసేటప్పుడు పెరుగుతో తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..