Ear Bleeding: చెవిలో నుంచి రక్తం కారితే ఎంత ప్రమాదమో తెలుసా? వెంటనే ఏం చెయ్యాలంటే..

చెవి ఇన్‌ఫెక్షన్లు ఏ వయసులోనైనా రావొచ్చు. కొంతమందికి చెవిలో తరచూ రక్తం కారుతుంటుంది. దీనిని పెద్దగా పట్టించుకోకుండా చెవిలో నూనె చుక్క వేసి వదిలేస్తారు. కొంతమంది అదే తగ్గిపోతుందని తేలిగ్గా తీసుకుంటారు..

Ear Bleeding: చెవిలో నుంచి రక్తం కారితే ఎంత ప్రమాదమో తెలుసా? వెంటనే ఏం చెయ్యాలంటే..
Ear Bleeding
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 24, 2023 | 6:09 PM

చెవి ఇన్‌ఫెక్షన్లు ఏ వయసులోనైనా రావొచ్చు. కొంతమందికి చెవిలో తరచూ రక్తం కారుతుంటుంది. దీనిని పెద్దగా పట్టించుకోకుండా చెవిలో నూనె చుక్క వేసి వదిలేస్తారు. కొంతమంది అదే తగ్గిపోతుందని తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఇది చాలా సమస్యగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాదారణంగా జలుబు ఎక్కువగా చేయడంతో పాటు ముక్కులో ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా ఉండటంతో చెవిలో ఇన్‌ఫెక్షన్‌ వస్తుంది. దీనితో చెవినొప్పి, వినికిడి సమస్య తలెత్తుతుంది. ఒక్కోసారి చెవి లోపలి మార్గంలో ఉండే చర్మం పగిలినప్పుడు రక్తస్రావం అవుతుంది. ఇటువంటి సందర్భంలో కొద్దిగా రక్తం కారి, తర్వాత ఆగిపోతుంది. దీని వల్ల భవితష్యత్తులో ఎటువంటి ప్రమాదం ఉండదు. ఐతే ఇది చిన్న అనారోగ్య సమస్యే కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. లేదంటే అవే తర్వాత పెద్ద అనారోగ్య సమస్యలుగా మారి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది.

ముఖ్యంగా చెవిలో రక్తం కారే సమస్య ఉన్న వారు వెంటనే తగిన చికిత్స తీసుకోకపోతే భవిష్యత్తులో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే మాత్రమే ఆ విధంగా జరుగుతుంది. గతంలో ఎప్పుడైనా తలపై బలమైన దెబ్బ తగిలితే చెవిలో నుంచి రక్తం కారే అవకాశాలు ఉంటాయి. ఇది చాలా తీవ్రమైన సమస్య. ఇలాంటి సమస్య ఎదురైతే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే లౌడ్ స్పీకర్ల శబ్దాలు విన్నా, పేలుళ్ల శబ్దాలు విన్నా ఈ విధంగా జరుగుతుంది. ఆ సమయంలో చెవిలోని కర్ణభేరిపై ఒత్తిడి పెరిగితే చెవి నుంచి రక్తం కారుతుంది. చెవిలోని చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అలాగే చెవిలో పుండ్ల వల్ల, ఇన్ఫెక్షన్ల వల్లకూడా రక్తస్రావం అవుతుంది. క్యాన్సర్ వ్యాధి ఉన్నవారికి కూడా చెవిలో నుంచి రక్తం కారే అవకాశాలు ఉంటాయి. అందువల్ల చెవికి సంబంధించి ఎటువంటి సమస్య వచ్చినా వైద్యులను వెంటనే సంప్రదించడం మరచిపోకూడదు. తర్వాత పరిణామాలకు ఎంత పరిగెత్తినా ఫలితం ఉండదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.