AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthika Deepam: పంతం నెగ్గించుకున్న ‘కార్తీక దీపం’ మోనిత.. పెళ్లికళ వచ్చేసిందంటూ హంగామా..

'కార్తీక దీపం' తెలుగు సీరియల్‌కు ఇంతటి ప్రాథాన్యత దక్కడం బహుశా ఇదే మొదటిసారేమో. ఇక కార్తీక దీపం సీరియల్‌ సోమవారంతో ముగింపుకు రానుంది. మెప్పించే ముగింపంటూ ప్రేక్షకులను ఊరించి చివరికి..

Karthika Deepam: పంతం నెగ్గించుకున్న 'కార్తీక దీపం' మోనిత.. పెళ్లికళ వచ్చేసిందంటూ హంగామా..
Shobha Shetty
Srilakshmi C
|

Updated on: Jan 23, 2023 | 8:32 PM

Share

తెలుగు బుల్లితెరపై కార్తీక దీపం సీరియల్‌ చెరగని ముద్రవేసింది. ఆరేళ్లపాటు దాదాపు 1568 ఎపిసోడ్లతో ఘన విజయం సాధించింది. ఒక తెలుగు సీరియల్‌కు ఇంతటి ప్రాథాన్యత దక్కడం బహుశా ఇదే మొదటిసారేమో. ఇక కార్తీక దీపం సీరియల్‌ సోమవారంతో ముగింపుకు రానుంది. మెప్పించే ముగింపంటూ ప్రేక్షకులను ఊరించి చివరికి ప్రధాన పాత్రలైన వంటలక్క, డాక్టర్‌ బాబుల ఫొటోలకు దండపడేలా కనబడుతోంది. ప్రోమో చూసిన తర్వాత ప్రేక్షకులు పెదవివిరిచేస్తున్నారు. ఆద్యాంతం వంటలక్క, డాక్టర్‌ బాబులను కలవనీయకుండా ముప్పుతిప్పలు పెట్టిన రాక్షస ప్రేయసి మోనిత పాత్ర ప్రేక్షకులపై బలమైన ముద్రవేసిందనే చెప్పవచ్చు. ఇక రీల్‌ లైఫ్‌ వదిలి రియల్‌ లైఫ్‌లోకొస్తే.. ఈ సీరియల్‌లో మోనిత పేరుతో అలరించిన శోభాశెట్టి త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. ఈ శుభవార్తను తనే స్వయంగా యూట్యూబ్‌ వీడియో ద్వారా వెల్లడించింది.

‘ఈ రోజు నాకు పెళ్లి చూపులు.. పెళ్లి చూపులు అనే పదం చెప్పడానికే సిగ్గుగా ఉంది. ఫస్ట్‌ టైం సిగ్గుపడుతున్నానంటే నాకు పెళ్లికళ వచ్చేసినట్లే ఉంది. ఈరోజు నా బర్త్‌డే. ప్రతి ఏడాది ఈరోజు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుపుకుంటాం. నాకు తెలియకుండానే అమ్మ పెళ్లిచూపులు ఏర్పాటు చేసింది. ఆ అబ్బాయెవరో కూడా తెలియదు. నన్ను చూడటానికి ఈ రోజు మా ఇంటికొస్తున్నాడు. అందుకోసమే రెడీ అవుతున్నానంటూ’ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో విడుదల చేసిన వీడియోలో సిగ్గు ఒలకబోసింది. అనంతరం ట్రెండీ లుక్‌లో పట్టు చీర కట్టుకుని చక్కగా అలంకరించుకుని మెరిసిపోయింది మన మోనిత. సీరియల్‌లో పెళ్లి గోలతో హోరెత్తించిన నటి శోభాశెట్టి రియల్‌ లైఫ్‌లో నిజంగానే పెళ్లిపీటలెక్కబోతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.