అనుమానమే పెనుభూతమై..! భార్యను హత్య చేసి.. ఇంటికి తాళం వేసి.. పరార్‌

ప్రేమించి పెళ్లాడి.. ఆనక భార్యను హత్య చేసి ఏమీ ఎరగనట్టు ఇంటికి తాళం వేసి పరారయ్యాడో పతి దేవుడు. భార్యను అతికిరాతకంగా కొట్టి, ఆనంతరం గొంతు నులిమి హత్య చేశాడు..

అనుమానమే పెనుభూతమై..! భార్యను హత్య చేసి.. ఇంటికి తాళం వేసి.. పరార్‌
UP Murder Case
Follow us

|

Updated on: Jan 23, 2023 | 3:59 PM

ప్రేమించి పెళ్లాడి.. ఆనక భార్యను హత్య చేసి ఏమీ ఎరగనట్టు ఇంటికి తాళం వేసి పరారయ్యాడో పతి దేవుడు. భార్యను అతికిరాతకంగా కొట్టి, ఆనంతరం గొంతు నులిమి హత్య చేశాడు. నిందితుడిని శనివారం (జనవరి 22) పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నోయిడా సమీపంలోని సెక్టార్ 58లోని బిషన్‌పురా గ్రామంలో నిందితుడు సూరజ్ (25), అంజలి (22) దంపతులు గత కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. వీరికి రెండేళ్ల కుమార్తె కూడా ఉంది (సంఘటన జరిగిన రోజున వీరి కుమార్తె అంజలి తల్లి దగ్గర ఉంది). సూరజ్ నోయిడాలోని ఓ ఫర్నీచర్ షాపులో పనిచేసేవాడు. గతేడాది డిసెంబర్‌లో ఉద్యోగం పోయింది. ఐతే అంజలిపై సూరజ్‌ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై తరచూ వీరిమధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో భార్యను హత్య చేసి తమ ఫ్లాట్‌లో హత్య చేసి, బయటి నుంచి తాళం వేసి పరారయ్యాడు. వీరి ఫ్లాట్‌ నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంజలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అల్లుడు సూరజ్‌ తమ కుమార్తెను హత్య చేశాడని జనవరి 10న పోలీసులకు ఫిర్యాదు చేశారు అంజలి తల్లిదండ్రులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడు సూరజ్‌పై రూ.20 వేల రివార్డు ప్రకటించారు.

డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో పోలీసు స్పెషల్‌ టీం గాలింపు చర్యలు చేపట్టింది. సూరజ్ ఇంకా నోయిడాలో ఉన్నాడని, పోలీసుల కంటపడకుండా పార్కులు, ఫుట్‌పాత్‌లపై గడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు శనివారం సాయంత్రం సెక్టార్ 57లోని డి పార్క్ వద్ద ఉన్న నిందితుడిని పథకం ప్రకారం చుట్టుముట్టారు. ఐతే సూరజ్‌ పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సూరజ్‌ కాలికి బుల్లెట్‌ తగిలింది. చికిత్స నిమిత్తం అతన్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం నిందితుడిని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయట పెట్టాడు. డిసెంబర్‌ 31 రాత్రి ఇరువురికి గొడవ జరిగినట్లు, కోపోద్రిక్తుడైన సూరజ్‌ ఇనుప పాన్‌తో అంజలి తలపై బలంగా పదేపదే కొట్టానని, అనంతరం ఆమె కిందపడగానే గొంతునులిమి హత్య చేసినట్లు వెల్లడించాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత సూరజ్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరిచి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు అడిషనల్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అశుతోష్ ద్వివేది తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.