సిద్దిపేట జిల్లాలో సంచలనం సృష్టించిన మహిళల హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈజీ మనీకి అలవాటు పడి వరుస హత్యలకు పాల్పడుతున్న తల్లి రజిత, ఆమె మైనర్ కుమారుడిని అరెస్టు చేశారు. బాధితులను గొంతు పిసికి చంపి, బంగారాన్ని దోచుకున్నట్లు సీపీ రష్మీ పెరుమాళ్ వెల్లడించారు.