నల్గొండలో సంచలనం సృష్టించిన రూపారెడ్డి హత్య కేసులో మిస్టరీ వీడలేదు. ఈ హత్య కేసులో కీలక ఆధారాలు లభించలేదు. అత్యంత కిరాతకంగా జరిగిన ఈ హత్య కేసు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. నిందితులు పక్కా ప్లాన్‌తో వ్యవహరించినట్లు భావిస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన రెడ్ టీషర్ట్ వ్యక్తిపైనే పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు.