AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాంబార్‌లో మునక్కాడలు ఎందుకు వేస్తారు? దీని వెనకున్న కథ తెలుసా?

దక్షిణ భారత దేశంలో ప్రధాన వంటకాల్లో సాంబార్ కూడా ముందుంటుంది. ఇంటిలో ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే సాంబర్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇక ఇందులో రకరకాల కూరగాయలు వేస్తుంటారు. ముఖ్యంగా సాంబార్ అంటే మునక్కాడలు ఉండాల్సిందే? మరి అసలు ఈ సాంబర్‌లో మునగకాయలు ఎందుకు వేస్తారు. దీని వెనకున్న కథ తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Aug 18, 2026 | 1:45 PM

Share
సాంబార్‌లో మునగకాయలు ఉంటే ఆ రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే. అంత అద్భతంగా ఉంటుంది. అయితే ఇలా సాంబార్‌లో మునగకాయలు వేయడం వెనక అనేక కథలు ఉన్నాయని చెబుతున్నారు పెద్దలు. కాగా, మనం వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఉడికించిన పప్పు, కూరగాయల ముక్కలు సుగంధ ద్రవ్యాలు వేసి తయారు చేసే ఈ సాంబార్ వెనక చాలా కథలు ఉన్నాయి. ముఖ్యంగా సాంబార్ పుట్టుక వెనుక శంభాజీ మహారాజ్ కథ ఉండగా, ఈ మునగకాయలు వేయడం వెనుక వంట వాడి కథ ఉన్నదంట.

1 / 5
అయితే రాజు భోజన ప్రియుడంటే. వంటవాడు సాంబర్ చేయగా ఆయనకు అది అంత రుచిగా అపినించలేదంట. దీంతో సాంబార్ బాగా లేదు అని చెప్పడంతో, బాధపడిన వంటవాడు, అత్యంత రుచిగా సాంబర్ చేయడానికి ఏం వేయాలా అని ఆలోచించాడంట. అయితే ఆ కాలంలో ఇంటికి ఒక చింత చెట్టు, మునగాకు చెట్టు ఉండేనంట. అప్పుడే మునగకాయలను చూసిన వంటవాడు, మరసటి రోజు వాటిని కోసి సాంబర్‌లో వేసి రుచికరంగా వండాంట. అప్పుడు సాంబర్ టేస్ట్ చేసిన  రాజు నాకు ప్రతి రోజూ ఇదే కావాలి అన్నాడంట. అప్పటి నుంచి సాంబార్‌లో మునగకాయలు వేయడం అనవాయితిలా అయిపోయిందంట.

2 / 5
అంతే కాకుండా మరో కథ ప్రకారం, తమిళనాడు, కేరళ ఆలయాల్లో చాలా వరకు సాంబర్ ప్రసాదంగా చేసే వారంట. అయితే అప్పుడు కూరగాయలు ఎక్కువగా దొరకకపోతే, ఇంటి ముందు ఉండే మునగాకు చెట్టు కాయలను కట్ చేసి అందులో వేసే వారంట. అంతే కాకుండా మునగాకు చెట్టుకు ఆయుర్వేద పరంగా కూడా చాలా ప్రాముఖ్యత ఉండటంతో మునగకాయలను వేసి సాంబర్ చేసి ప్రసాదంగా పెట్టేవారంట.

3 / 5
ఇలా సాంబార్‌లో మునగకాయలను వేయడం వెనుక అనేక కథలు ఉన్నాయి. ఇక కొంత మంది మాత్రం కేవలం రుచి కోసమే వీటిని సాంబార్‌లో వేయడం జరిగింది అంటే, మరికొంత మంది మాత్రం మునగకాయ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండటం వలన దీనిని సాంబార్‌లో వేసి తినడం వలన కడుపు సమస్యలు తగ్గిపోతాయని వేయడం ప్రారంభించారని చెప్పుకొస్తుంటారు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us