AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Zodiac Signs: మూడు గ్రహాల యుతి.. ఇక ఈ రాశుల వారికి అరుదైన అదృష్టం..!

ఈ నెల(నవంబర్) 3, 4, 5 తేదీల్లో సింహ రాశిలో గురు, చంద్ర, కేతువుల యుతి జరగబోతోంది. గురు, చంద్రులు ఒకే రాశిలో కలవడాన్ని గజకేసరి యోగం అంటారు. అయితే, ఇక్కడ కేతువు కూడా కలవడం వల్ల ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకోవడానికి అవకాశం కలిగింది. Telugu Astrology: మూడు రోజుల పాటు కొనసాగే ఈ అరుదైన అదృష్ట యోగం వల్ల మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చిక రాశులవారి జీవితాల్లో సానుకూల మార్పులు సంభవించడం జరుగుతుంది. ఈ మూడు రోజుల్లో తీసుకునే నిర్ణయాలు, చేపట్టే కార్య‍క్రమాలు, ప్రయత్నాలు సమీప భవిష్యత్తులో అత్యంత ఉత్తమ ఫలితాలనిచ్చే అవకాశం ఉంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 02, 2026 | 4:08 PM

Share
మేషం: ఈ రాశికి పంచమ స్థానంలో గురు, చంద్ర, కేతువుల యుతి జరుగుతున్నందువల్ల అనేక మార్గా లలో ఆదాయం అంచనాల్ని మించే పెరిగే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి సంబంధించి ఎటు వంటి ప్రయత్నం చేపట్టినా పూర్తి ఫలితమిచ్చే అవకాశం ఉంది. కొద్ది కార్యక్రమాలు, కొత్త ప్రయ త్నాలు చేపట్టడానికి ఇది అనుకూల సమయం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు లాభసాటిగా, సంతృ ప్తికరంగా పురోగమిస్తాయి. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. శుభవార్తలు వింటారు.

1 / 6
వృషభం: ఈ రాశికి చతుర్థ స్థానంలో గురు చంద్రులు కలవడం వల్ల, కేతువుతో యుతి చెందడం వల్ల ఉద్యో గంలో పదోన్నతి లభించడానికి, జీతభత్యాలు అనూహ్యంగా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరిగి, లాభాలు వృద్ధి చెందుతాయి. ఉన్నత స్థాయి వర్గాలతో సత్సం బంధాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. సర్వత్రా గౌరవ మర్యాదలు లభించే అవకాశం ఉంది.

2 / 6
కర్కాటకం: రాశినాథుడు చంద్రుడు ధన స్థానంలో గురు, కేతువులతో కలవడం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. లాభదాయక సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల దిశగా దూసుకుపోతాయి. ఉద్యోగంలో హోదా పెరగడానికి, జీతభత్యాలు వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు అంచనాలకు మించి విజయవంతం అవుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. విదేశీ సంపాదన యోగం పడుతుంది.

3 / 6
సింహం: ఈ రాశిలో గురు, చంద్ర, కేతువుల యుతి చోటు చేసుకుంటున్నందువల్ల విదేశీ సంబంధమైన అవకాశాలు బాగా కలిసి వస్తాయి. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు లేదా సంపద కలిసి వచ్చే సూచ నలున్నాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి చెందుతారు.

4 / 6
తుల: ఈ రాశికి లాభ స్థానంలో గజకేసరి యోగం ఏర్పడడం, పైగా కేతువుతో కలవడం వల్ల ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి విముక్తి లభించి ఊహించని మనశ్శాంతి కలుగుతుంది. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. ఆదాయం బాగా పెరుగుతుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పూర్తిగా  తగ్గుముఖం పడతాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి చాలావరకు బయటపడడం జరుగు తుంది. సంపన్న వ్యక్తితో పెళ్లి ఖాయం కావడం గానీ, ప్రేమలో పడడం గానీ జరిగే అవకాశం ఉంది.

5 / 6
వృశ్చికం: ఈ రాశికి భాగ్య స్థానంలో గురు, చంద్రులతో కేతువు యుతి జరుగుతున్నందువల్ల సమాజంలో ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఉన్నత వర్గాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. ఉద్యోగంలో హోదా, ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. మీ సలహాలు, సూచనల వల్ల చాలామంది లబ్ధి పొందుతారు. విదేశీ అవకాశాలు లభిస్తాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.

6 / 6
Follow Us