AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ గురక శబ్దం పక్కింటి వరకు వినిపిస్తోందా? తగ్గించుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి!

గురక కారణంగా విడాకులు తీసుకున్న అనేక వింత కేసుల గురించి మనం విన్నాం. వాటి గురించి వార్తాపత్రికలలో చదివి నవ్వుకున్నాం. కానీ ఆ సమస్య మనలోనో లేదా మన ఇంట్లోని వారిలోనో ఉండవచ్చు. మనం దాని గురించి ఆందోళన చెందలేదు. గురక అనేది మొదట్లో నవ్వుకునే విషయం కాదు. శరీరంలోని మరేవో ఇతర సమస్యల వల్ల అది వస్తుందని మనలో ఎవరికీ తెలియదు. మీరు గానీ, మీ ఇంట్లోని వారు గానీ మీ ఇరుగుపొరుగు వారికి వినిపించేంత గట్టిగా గురక పెడుతున్నారా? ఇంత తీవ్రమైన గురకకు కారణం ఏమిటో మీకు తెలుసా? దాన్ని వెంటనే ఆపడానికి ఏం చేయవచ్చో మీకు తెలుసా? తెలుసుకుందాం.

మీ గురక శబ్దం పక్కింటి వరకు వినిపిస్తోందా? తగ్గించుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి!
How To Stop Snoring
Jyothi Gadda
|

Updated on: Nov 02, 2026 | 5:56 PM

Share

గురక అనేది కేవలం శబ్దానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, అది ఆరోగ్య క్షీణతకు కూడా సంకేతం కావచ్చు. ఊబకాయం, వెల్లకిలా పడుకునే అలవాటు, గొంతు కండరాల బలహీనత మరియు సైనస్ వంటి కారణాల వల్ల గురక వస్తుంది. పడుకునే పొజిషన్ మార్చడం, బరువు తగ్గడం, పక్కలకి తిరిగి పడుకోవడం మరియు జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా గురక సమస్యను ఇంట్లోనే సహజంగా అదుపు చేయవచ్చు.

గురక సమస్యను సహజంగా నివారించే అద్భుతమైన గృహచిట్కాలు

గురక పెడుతూ నిద్రపోవడం అనేది చాలా మందిలో కనిపించే సాధారణ సమస్య. అయితే ఇది మీతో పాటు పక్కన పడుకునే వారి నిద్రను కూడా పాడుచేస్తుంది. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం, గుండె సంబంధిత సమస్యలకు కూడా ఇది దారితీయవచ్చు. ఎలాంటి మందులు లేకుండా సహజ పద్ధతుల్లో గురకను ఎలా అరికట్టవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

1. నిద్రించే పద్ధతి మార్చడం

వెల్లకిలా పడుకోవడం వల్ల నాలుక, గొంతు కండరాలు వెనక్కి జారి శ్వాస మార్గానికి అడ్డుపడతాయి. దీనివల్ల గాలి పీల్చుకున్నప్పుడు కంపనాలు వచ్చి గురక శబ్దం పెరుగుతుంది. అందువల్ల ఎడమ వైపునకు లేదా కుడి వైపునకు ఒరిగి పడుకోవడం అలవాటు చేసుకోండి. ఇది శ్వాస మార్గాన్ని ఫ్రీగా ఉంచి గురకను తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

2. శరీర బరువును అదుపులో ఉంచుకోవడం

అధిక బరువు ఉన్నవారికి మెడ, గొంతు భాగంలో కొవ్వు ఎక్కువగా చేరుతుంది. ఇది శ్వాసనాళంపై ఒత్తిడి తెచ్చి గాలి ప్రసారానికి అడ్డంకిగా మారుతుంది. సరైన వ్యాయామం, క్రమశిక్షణతో కూడిన ఆహారపు అలవాట్ల ద్వారా బరువు తగ్గడం వల్ల గురక సమస్య చాలా వరకు నయమవుతుంది.

3. దిండు పరిశుభ్రత మరియు ఎత్తు

మీరు ఉపయోగించే దిండ్లు పాతవి అయితే వాటిపై దుమ్ము, ధూళి పడుతుంది. ఇవి అలెర్జీలకు కారణమై ముక్కు దిబ్బడ కలిగించవచ్చు. వారానికి ఒకసారి దిండు మార్చడం, సరైన ఎత్తు ఉన్న దిండును వాడటం ద్వారా శ్వాస సులభంగా ఆడుతుంది.

4. మద్యం, పొగతాగే అలవాట్లకు దూరంగా ఉండటం

ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గొంతులోని కండరాలు అతిగా సడలిపోతాయి. ఇది నిద్రలో శ్వాస మార్గాన్ని మూసివేసి గురకను పెంచుతుంది. పడుకోవడానికి కనీసం 4-5 గంటల ముందు మద్యం తీసుకోకపోవడం, ధూమపానానికి దూరంగా ఉండటం మంచిది.

5. పుష్కలంగా నీరు తాగడం

శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు ముక్కు, గొంతులోని శ్లేష్మం చిక్కగా మారి గురకకు కారణమవుతుంది. కాబట్టి రోజుకి సరిపడా నీరు తాగడం వల్ల శ్వాసకోశ మార్గాలు తేమగా ఉండి గురక తగ్గుతుంది.

ఈ చిన్న చిన్న చిట్కాలను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా నిశ్శబ్దమైన, ప్రశాంతమైన నిద్రను మీ సొంతం చేసుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us