AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లికి పైసా ఖర్చు పెట్టని దర్శకుడు.. రూ.1,250 కోట్ల ఆస్తి ఉన్న టరంటీనో తీరిది!

పిల్లలు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత తల్లిదండ్రులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటారు. కానీ హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్వెంటిన్ టరంటీనో ఇందుకు భిన్నం. 150 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1,250 కోట్ల) సంపద ఉన్నప్పటికీ తన 75 ఏళ్ల తల్లికి అందులో ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. చిన్నప్పుడు ఆమె ఎగతాళి చేసిన తీరు తన మనసులో బలంగా నాటుకుపోయిందని తాజాగా పాడ్ కాస్ట్ లో చెప్పారు.

తల్లికి పైసా ఖర్చు పెట్టని దర్శకుడు.. రూ.1,250 కోట్ల ఆస్తి ఉన్న టరంటీనో తీరిది!
Why Actor Quentin Tarantino Refuses To Give A Penny Of His Millions Fortune To His Mother
Sharada V
|

Updated on: Nov 02, 2026 | 6:37 PM

Share

ఎవరైనా ఉద్యోగంలో సెటిలైన తర్వాత తల్లిదండ్రులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటారు. కానీ హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్వెంటిన్ టరంటీనో ఇందుకు భిన్నం. 150 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1,250 కోట్ల) సంపద ఉన్నప్పటికీ తన 75 ఏళ్ల తల్లికి అందులో ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. చిన్నప్పుడు జరిగిన ఓ ఘటన మనసులో బలంగా నాటుకుపోయిందని ఇటీవల పాడ్ కాస్ట్ లో చెప్పారు.

క్వెంటిన్ టరంటీనో తెరకెక్కించిన Pulp Fiction, Kill Bill, Django Unchained వంటి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా  గుర్తింపు పొందాయి. రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్నారు. సినిమాల ద్వారా భారీగా  సంపాదించారు.  అయితే తల్లి విషయంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

12 ఏళ్ల వయసులోనే తల్లితో ఓ మాట అన్నారు

టరంటీనోకి చిన్నతనంలో చదువుపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. స్కూల్‌కెళ్లినా తరగతి గదిలో కథలు రాయడంపై ఆసక్తి ఉండేది. చదువులో వెనకబడటంతో పాటు తరచూ స్కూల్‌లో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ పరిణామం అతని తల్లి కొన్నీ జాస్టౌపిల్ ని(Connie Zastoupil) అసహనానికి గురి చేసేది. కుమారుడు  తరగతి గదిలో కథలు రాయడాన్ని ఆమె తప్పుపట్టారు.  కథలు రాయడం ఎందుకూ పనికి రాదని తిట్టిపోసేవారు.

తల్లి మాటలు టరంటీనోను తీవ్రంగా బాధించేవి.  తన 12 ఏళ్ల వయసులో, ‘అమ్మా.. నీ కోసం ఇల్లు కొనను.. కారు కొనను!’ అని గట్టిగా నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు.  తన సినిమాలు విజయం సాధించినా తన తల్లికి ఆ సంపదలో వాటా ఇవ్వకూడదని డిసైడ్ అయినట్లు టరంటీనో చెప్పారు. చిన్నప్పుడు సినిమాకు రాయాలన్న తన కలను ఎగతాళి చేసిన తల్లికి ఇల్లు కొనివ్వను, వెకేషన్‌కు తీసుకెళ్లను,  కాడిలాక్ కారు కూడా కొనివ్వను అనుకున్నట్లు చెప్పారు. తల్లి అన్న మాటలకు ఇదే తన సమాధానమని వివరించారు. దశాబ్దాలు గడిచి తను అనుకున్నట్లుగానే ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడిగా ఎదిగారు. సుమారు 150 మిలియన్ డాలర్లు సంపాదించారు. అయితే ఇప్పటికీ తన నిర్ణయంలో మార్పు లేదనీ తెలిపారు.

టాక్స్ సమస్య లో మాత్రమే సాయం

భారీ సంపద ఉన్నప్పటికీ తన తల్లికి ఇప్పటిదాకా ఇల్లు లేదా కారు కొనివ్వలేదని టరంటీనో వెల్లడించారు. అయితే అమెరికా పన్నుల విభాగం (IRS)తో తలెత్తిన ఓ సమస్యను పరిష్కరించడానికి మాత్రం ఆర్థికంగా సహాయం చేసినట్లు చెప్పారు. టెన్నెసీలో నర్సుగా పనిచేస్తున్న తన తల్లి విషయంలో అంతకు మించి ఆర్థిక బాధ్యత తీసుకోలేదని అన్నారు.

ఈ సందర్భంగా పాడ్‌కాస్ట్ హోస్ట్ బ్రియాన్ కొప్పెల్‌మన్ మాట్లాడుతూ.. తల్లి విమర్శలు మిమ్మల్ని విజయం వైపు నడిపించడానికి ప్రేరేపించి ఉండవచ్చు కదా అన్నారు.  టరంటీనో మాత్రం దానిని మరో కోణంలో చూశారు. ‘మనం మాట్లాడే మాటలకు పరిణామాలు ఉంటాయి’ అంటూ పిల్లల అభిరుచులు, ఆశయాలను తల్లిదండ్రులు హేళన చేసి మాట్లాడటం సరికాదన్నారు.  తల్లిదండ్రుల మాటలే పిల్లల మనసుపై ప్రభావం చూపుతాయనీ తన అనుభవమే ఉదాహరణ అని వివరించారు. టరంటీనో వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. కొందరు ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు తల్లిదండ్రుల పట్ల ఈ వైఖరి సరికాదని అభిప్రాయపడుతున్నారు.

Follow Us