యూరిక్ యాసిడ్ ఉంటే శరీరంలో కనిపించే లక్షణాలు ఇవే!
Samatha
18 August 2026
తీసుకుంటున్న ఆహారం జీవనశైలి కారణంగా చాలా మంది యూరిక్ యాసిడ్ బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇక శరీరంలో యారిక్ యాసిడ్ ఎక్కువైనప్పుడు కీళ్లనొప్పులు, బొటన వేలులో తీవ్రమైన నొప్పి, కండరాల నొప్పు
లు వంటి సమస్యలు ఏర్పడుతాయి.
కాగా, ఇప్పుడు మనం యూరిక్ యాసిడ్ ఎక్కువైనప్పుడు ఎక్కువగా ఏ లక్షణాలు కనిపిస్తాయి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాం.
కీళ్ల నొప్పులు , ముఖ్యంగా రాత్రి సమయంలో కాలి బొటనవేలు, చీలమండల వద్ద విపరీతమైన నొప్పి రావడం జరుగుతుంది.
అంతే కాకుండా ఉదయం లేచినప్పుడు చేతి వేళ్లు మోకాళ్లు గట్టిగా కదల్చడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది.
అలాగే చేతి వేళ్లు, మోచేతులు, చెవుల వద్ద చిన్న చిన్న గడ్డలు ఏర్పడటం వంటి సమస్యలు ఎదురు అవుతుంటాయి
.
అంతే కాకుండా యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే, తరచూ మూత్ర విసర్జన చేయడం లేదా మూత్రం తగ్గిపోవడం జరుగుతుం
ది.
అంతే కాకుండా అలసట, బలహీనత ఏ పని చేయలేకపోవడం వంటి అనేక ఇబ్బందులు తలెత్తుతాయంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
మనుషుల్లా విడాకులు తీసుకునే పక్షులు.. వీటి ప్రేమ కథ తెలుసా!
జీవితంలో ఒకసారే వికసించి, మరణించే అద్భతమైన మొక్కలివే ఇవే!
చాణక్య నీతి : స్త్రీలు ఎవరికీ చెప్పకూడని రహస్యాలు ఇవే.. చెబితే ఖతమే