AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Metal: బంగారం, వెండి కాదు.. రాబోయే రోజుల్లో ఈ లోహనికే అసలు సిసలు క్రేజ్.. ధరలు మాములుగా ఉండవ్..

దేశంలో కాపర్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్, సరఫరా తగ్గడంతో ధరలపై ఒత్తిడి పడుతోంది. రాగి గనుల స్థాపనకు మరింత సమయం పట్టే అవకాశముంది. పాత గనుల్లో రాగి నాణ్యత తగ్గుతుంది. దీంతో రాగి ఉత్పత్తి తగ్గిపోయిందని చెప్పవచ్చు.

Metal: బంగారం, వెండి కాదు.. రాబోయే రోజుల్లో ఈ లోహనికే అసలు సిసలు క్రేజ్.. ధరలు మాములుగా ఉండవ్..
Copper Prices
Venkatrao Lella
|

Updated on: Aug 18, 2026 | 3:09 PM

Share

బంగారం, వెండికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కువమంది ఇష్టపడే లోహలు ఇవే. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు, రాజకీయ అనిశ్చితి, పెరుగుతున్న డిమాండ్ కారణంగా గోల్డ్, సిల్వర్ ధరలు గత రెండేళ్ల కాలంలో భారీగా పెరిగాయి. అయితే ఈ రెండు లోహలతో పాటు మరో మెటల్ ధర కూడా రికార్డ్ స్థాయిలో పెరుగుతోంది. అదేదో కాదు.. రాగి. కాపర్ ధరలు గత కొన్నేళ్లుగా భారీగా పెరుగుతూ వస్తోన్నాయి. బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతుండటంతో.. చాలామంది రాగి వైపు చూస్తున్నారు. ధరలు పెరగడానికి ఇది ఒక కారణం కాగా.. పారిశ్రామిక అవసరాల్లో కూడా రాగిని ఎక్కువగా వినియోగించడం మరొక రీజన్‌గా చెప్పవచ్చు. అంతర్జాతీయంగా కాకుండా భారతదేశంలోనూ రాగి ధరలు అమాంతం పెరుగుతూ వస్తున్నాయని చెప్పవచ్చు.

భారత్‌లోనూ పెరుగుతున్న ధరలు..

భారత్‌లో రాగి ధరలు ఆగస్టులో కిలోగ్రాముకు 1400కి చేరుకున్నాయి. రాగి సరఫరా పరిమితం ఉండటం, ప్రపంచవ్యాప్తంగా ఈ లోహనికి డిమాండ్ పెరగడంతో ధరలు పెరుగుతున్నట్లు ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్, ఏఐ డేటా సెంటర్లు, పవర్ గ్రిడ్లు, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో రాగిని ఎక్కువగా వాడుతున్నారు. దీంతో పాత గనుల్లో రాగి నాణ్యత క్షీణించడం, కొత్త గనుల ప్రారంభానికి మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో సరఫరా ఒక సవాల్‌గా మారింది. దీంతో రాగిని ఇతర దేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకుంటుంది. ఆగస్ట్ 17న మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో రాగి కాంట్రాక్టులు భారీ ర్యాలీని కొనసాగిస్తున్నాయి. తక్షణ సరఫరాను దక్కించుకునేందుకు ప్రీమియం కూడా కొనుగోలుదారులు చెల్లిస్తున్నారు. ఇక లండన్ మెటల్ ఎక్సేంజ్‌లో రాగి ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి.

డిమాండ్ ఎక్కువగా ఉండగా.. సరఫరా తక్కువగా ఉంది. ఈ కారణంగానే రాగి ధరలు పెరుగుతున్నాయి. కొత్త రాగి గనిని ప్రారంభించాలంటే సుదీర్ఘ సమయం పడుతుంది. అలాగే అత్యంత ఖర్చుతో కూడుకున్న పని కూడా. ప్రభుత్వం నుంచి అనుమతులు పొందటం, గనిని అభివృద్ది చేయడం, మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు అనేక సంవత్సరాల సమయం పడుతుంది. దీని వల్ల రాగి గనులు స్థాపన, సరఫరా పెరగడానికి సమయం పట్టే అవకాశముంది. 2040 నాటికి రాగికి డిమాండ్ 50 శాతం పెరగవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రపంచంలో రాగి డిమాండ్ 2025లో సుమారు 28 మిలియన్ టన్నులగా కొనసాగుతుండగా.. 2040 నాటికి 42 మిలియన్ టన్నులకు పెరిగే అవకాశముంది. డిమాండ్‌ 50 శాతం పెరగవచ్చు. విద్యుదీకరణ, పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రిక్ వాహనాలు, ఏఐ డేటా సెంటర్లు డిమాండ్‌ను పెంచుతున్నాయి. ఈ రంగాలన్నింటికీ విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, వినియోగం కోసం రాగి అవసరం.

Follow Us