తెలంగాణ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల.. జనవరి 28 నుంచి దరఖాస్తులు స్వీకరణ
తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సోమవారం (జనవరి 23) విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం..
తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సోమవారం (జనవరి 23) విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. జనవరి 27 నుంచి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుంది. జనవరి 28 నుంచి 30 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరణ పూర్తవుతుంది. మార్చి 4 నాటికి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పూర్తి చేయనున్నారు. మార్చి 5 నుంచి 19 వరకు అప్పీళ్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. టీచర్ల నుంచి దరఖాస్తులు అందిన 15 రోజుల్లోపు అప్పీళ్లను పరిష్కరించనున్నట్లు విద్యాశాఖ తాజా షెడ్యూల్‌లో పేర్కొంది.
కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీచర్ల బదిలీలు, పదోన్నతులకు అనుమతి ఇచ్చిన రోజుల వ్యవధిలోనే వేగంగా ప్రక్రియ చేపట్టడం విశేషం. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల నిరీక్షణకు తెరదించినట్లైంది.
ఉద్యోగులకు 2.73 శాతం డీఏ పెంపు..
దీనితోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 2.73 శాతం డీఏ పెంచుతూ ప్రకటన. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న 17.29 శాతాన్ని 20.02 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి పింఛన్‌తో కలిపి ఫిబ్రవరిలో పింఛన్‌దారులకు డీఏ చెల్లించనుంది. 2021 జులై నుంచి 2022 డిసెంబర్ నెలాఖరు వరకు 8 విడతల్లో డీఏ బకాయిలను జీపీఎఫ్‌లో జమ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనివల్ల 4.40 లక్షల మంది ఉద్యోగులు, 2.88 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ఈ పెంపు గతేడాది జూలై 1వ తేదీ నుంచి వర్తించనుంది.
తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీ షెడ్యూల్ 2023 కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.