BharOS: మేడిన్ ఇండియా ఆపరేటింగ్ సిస్టమ్.. ఇక ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లకు చెక్.. పూర్తి వివరాలు..
ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఐఐటీ మద్రాస్ దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ (OS)ను ఆవిష్కరించింది. దీనికి భార్ ఓఎస్(BharOS) అని పేరు పెట్టింది. ప్రైవసీ, సెక్యూరిటీయే లక్ష్యంగా ఈ ఓఎస్ ను రూపొందించారు.
ప్రస్తుతం ఫోన్ అంటే ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ తో కూడిన ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే గుర్తుకువస్తాయి. అవి అందించే ఫీచర్లు, సులభతర ఆపరేషన్, వేగంగా స్పందించే విధానంతో ఎక్కువ మంది వీటినే వినియోగిస్తున్నారు. దీంతో ఈ రెండే ఆపరేటింగ్ సిస్టమ్ లే మొబైల్ ఓఎస్ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే గత రెండేళ్లకు వీటికి పోటీగా అనేక ప్రత్యామ్నాయ ఆపరేటింగ్ సిస్టమ్ లు వస్తున్నాయి. వాటిని సవాలు చేస్తూ.. వాటికన్నా మించిన స్పీడ్, ఫీచర్స్, వినియోగదారుల డేటా భద్రతకు భరోసా నిస్తూ ఆండ్రాయిడ్, ఐఓఎస్ లకు సవాలు విసురుతున్నాయి. దానిలో ప్రధానంగా మన మేడిన్ ఇండియా ఆపరేటింగ్ సిస్టమ్ భార్ఓఎస్(BharOS) గురించి చెప్పుకోవాలి. దీని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఆత్మ నిర్భర్ లో భాగంగా..
ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఐఐటీ మద్రాస్ దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ (OS)ను ఆవిష్కరించింది. దీనికి భార్ ఓఎస్(BharOS) అని పేరు పెట్టింది. ప్రైవసీ, సెక్యూరిటీయే లక్ష్యంగా ఈ ఓఎస్ ను రూపొందించారు. ఐఐటీ మద్రాస్, ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ కలిసి ఇంక్యుబేట్ చేసిన జాండ్ కే ఆపరేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (JandKops) ఈ ఓఎస్ ను డెవలప్ చేసింది.
100 కోట్ల మంది వినియోగించుకునేలా..
భార్ ఓఎస్ ఇతర ఆపరేటింగ్ సిస్టమ్ ల కన్నా మెరుగైందిగా నిలుస్తోంది. అలాగే ఇది థర్డ్ పార్టీ యాప్స్ ను అనుమతించదు. వైరస్, మాల్వేర్, హ్యాకర్లను నియంత్రిస్తుంది. దేశంలోని 100 కోట్ల మంది మొబైల్ యూజర్ల డేటా భద్రంగా ఉండేలా, వాడుకోవడానికి సౌకర్యంగా ఉండేలా దీన్ని రూపొందించారు. కాన్ఫిడెన్షియల్ కమ్యూనికేషన్లు, సున్నితమైన సమాచారాన్ని అత్యంత గోప్యంగా, భ్రదంగా ఉంచాలనుకునే కొన్ని సంస్థలు ఈ ఓ ఎస్ ప్రస్తుతం వినియోగిస్తున్నాయి. ప్రైవేట్ 5G నెట్‌వర్క్‌ల ద్వారా దీనిని వినియోగిస్తున్నారు.
డేటా భద్రం..
భార్ ఓఎస్ కలిగిన మొబైల్ ఫోన్లలో కొన్ని నియంత్రిత యాప్‌లను మాత్రమే అనుమతిస్తుంది. ప్రీ ఇన్ స్టాల్డ్ యాప్స్ ఉండవు. దీని వల్ల యాప్ పర్మిషన్ల విషయంలో వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం అత్యంత గోప్యంగా ఉంచవలసిన కమ్యూనికేషన్‌లు, డేటా అత్యంత భద్రంగా, అవసరమయ్యే గోప్యమైన సమాచారాన్ని నిర్వహించే వినియోగదారులకు కఠినమైన గోప్యత మరియు భద్రతా అవసరాలు ఉన్న సంస్థలకు BharOS సేవలు అందించబడుతున్నాయి. అటువంటి వారు ప్రైవేట్ 5G నెట్‌వర్క్‌ల ద్వారా దీనిని వినియోగించుకుంటున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..