- Telugu News Photo Gallery Technology photos List of best smartphones under 7000 check here for price and features au57
smartphone: కొత్త ఫోన్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 7 వేల లోపు బెస్ట్ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి.
కొత్తగా స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉన్నారా.? మీ బడ్జెట్ రూ. 7 వేల లోపా.. అయితే మీ బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
Updated on: Jan 24, 2023 | 8:07 PM

Xiaomi Redmi 4A: రూ. 7 వేలలోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌లో ఇదీ ఒకటి. రూ. 5999కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌లో 5 ఇంచెస్ డిస్‌ప్లేను అందించారు. 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో 13 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు.

Xiaomi Redmi 3s: షావోమీ రెడ్‌మీ 3ఎస్ స్మార్ట్ ఫోన్ ధర రూ. 6,999గా ఉంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 430 అక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 13 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

Tecno POP 6 Pro: టెక్నో కంపెనీకి చెందిన ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్‌లో రూ. 5999కి అందుబాటులో ఉంది. ఇందులో 6.56 హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. ఇందులో 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను అందించారు. 8 ఎంపీ రెయిర్ కెమెరాను అందించారు.

Redmi A1: రెడ్‌మీ ఏ1 స్మార్ట్‌ఫోన్ ధర రూ. 5,799గా ఉంది. 4జీ నెట్‌వర్క్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 16.56 సీఎమ్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 8 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.

Lenovo vibe k5: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 6,999కి అందుబాటులో ఉంది. 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ కెపాసిటీ ఉన్న ఈ ఫోన్‌లో 5 ఇంచెస్ డిస్‌ప్లేను అందించారు. 13 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్ సొంతం.





























