AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలాంటి కాలేజీలు కూడా ఉంటాయా? లవర్ లేకుంటే ఎంట్రీ లేదట! వైరల్ అవుతున్న ‘నోటీస్’..

Odisha College Notice: స్కూళ్లో, కాలేజీలో ప్రేమ వ్యవహారాలు నడిపితే తాట తీస్తారు టీచర్లు, ప్రొఫెసర్లు. గుట్టుచప్పుడు కాకుండా నడిపినా.. తెలిస్తే మాత్రం సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. ఏం కతలు పడినా.. అంతా బయటే ఉండాలి.

ఇలాంటి కాలేజీలు కూడా ఉంటాయా? లవర్ లేకుంటే ఎంట్రీ లేదట! వైరల్ అవుతున్న ‘నోటీస్’..
Odisha College Notice
Shiva Prajapati
|

Updated on: Jan 24, 2023 | 5:55 PM

Share

స్కూళ్లో, కాలేజీలో ప్రేమ వ్యవహారాలు నడిపితే తాట తీస్తారు టీచర్లు, ప్రొఫెసర్లు. గుట్టుచప్పుడు కాకుండా నడిపినా.. తెలిస్తే మాత్రం సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. ఏం కతలు పడినా.. అంతా బయటే ఉండాలి. కాదని కాంపౌండ్ ఇటువైపు చేశారో గెట్ అవుట్ ఫ్రమ్ స్కూల్/కాలేజ్ అంటూ ప్రిన్సిపాల్ గెంటేస్తారు. మరి అలాంటి పరిస్థితుల ఉన్న తరుణంలో.. కాలేజీలో అమ్మాయిలు, అబ్బాయిలు జంటగా మాత్రమే రావాలంటూ నోటిసులు అంటిస్తే.. ఊహకు బాగానే ఉంది కానీ, ఇది నిజమయ్యే ఛాన్స్ ఉందంటారా? అని సందేహం రాక మానదు. కానీ, తాజాగా ఓ కాలేజీ ఇలాంటి నోటీసులే అంటించింది. అసలే ప్రేమికుల దినోత్సవం అయిన ఫిబ్రవరి 14 వచ్చేస్తుంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ కాలేజీలో కీలక నోటీసులు అంటించారు.

ఒడిషాలోని జగత్‌సింగ్‌పూర్‌లోని ఎస్‌విఎం అటానమస్ కాలేజీలో ఈ ఘటన వెలుగు చూసింది. ‘ప్రేమికుల దినోత్సవానికి ముందే అమ్మాయిలు, తమ భాగస్వామిని ఎంచుకోవాలి. ఫిబ్రవరి 14లోపు అలా చేయని పక్షంలో అమ్మాయిలకు క్లాస్‌లోకి అనుమతించడం జరుగదు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సింగిల్ గర్ల్స్ ని కాలేజీలో అనుమతించడం జరగదు. అమ్మాయితే తమ బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తాజాగా దిగిన ఫోటోలను ప్రిన్సిపాల్ ఆఫీస్‌లో సబ్మిట్ చేయాలి.’ అని ఆ నోటీసులో పేర్కొంది. అంతేకాదండోయ్.. కాలేజీ స్టాంప్, కాలేజీ ప్రిన్సిపాల్ సంతకం కూడా ఇందులో ఉండటం విశేషం. ఈ నోటీస్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది.

ఫేక్ నోటీస్..

అయితే, ఇది ఫేక్ నోటీస్ అని తేలింది. కాలేజీ అలాంటి నోటీస్ ఏమీ ఇవ్వలేదని తేలింది. కాలేజీ విద్యార్థులు మాట్లాడుతూ.. ‘మేమంతా ఈ వైరల్ నోటీస్‌ను చూశాం. ఇది వాస్తవం కాదు. ఇది ఫేక్ నోటీస్. మా కాలేజీకి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఎవరో ఇలా చేశారు. మా ప్రిన్సిపాల్ మంచి వ్యక్తి. ఆయన ఇలాంటి పని చేయరు.’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ అంశంపై కాలేజీ ప్రిన్సిపాల్ బిజయ్ పాత్ర కూడా చాలా సీరియస్ అయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను అలాంటి నోటీసులను జారీ చేయలేదని స్పష్టం చేశారు. ‘నేను ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు. ఆ లెటర్ హెడ్ నకిలీది.’ అని వివరణ ఇచ్చారు. ఈ ఫేక్ నోటీసుపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరినట్లు తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్