Janhvi kapoor: అతిలోక సుందరి కూతురంటే ఈ మాత్రం ఉంటుంది మరి.. వైట్ శారీలో దేవకన్యలా జాన్వీ.
జాన్వీ కపూర్.. సగటు సినీ ప్రేక్షకుడికి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చేసినవి కొన్ని సినిమాలే అయినా ఎక్కడ లేని క్రేజ్‌ను దక్కించుకుందీ బ్యూటీ. తండ్రి నిర్మాత, తల్లి బడా స్టార్ హీరోయిన్ ఇలాంటి నట వారసత్వం అండగా ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును...
జాన్వీ కపూర్.. సగటు సినీ ప్రేక్షకుడికి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చేసినవి కొన్ని సినిమాలే అయినా ఎక్కడ లేని క్రేజ్‌ను దక్కించుకుందీ బ్యూటీ. తండ్రి నిర్మాత, తల్లి బడా స్టార్ హీరోయిన్ ఇలాంటి నట వారసత్వం అండగా ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది జాన్వీ కపూర్. బడా స్టార్ కాస్టింగ్, భారీ బడ్జెట్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నా ‘ధడక్’ అనే చిన్న సినిమాతో వెండి తెరకు పరిచయమైంది జాన్వీ. తొలి సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది జాన్వీ. ఆ తర్వాత కూడా నటనకు, కథకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తూ వస్తోంది.
ఇదిలా ఉంటే సినిమాల్లో ఎక్కువగా గ్లామర్ పాత్రల్లో కనిపించని జాన్వీ కపూర్. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ డోస్‌ను పెంచేస్తోంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారును కట్టిపడేస్తోంది. ఇక సోషల్ మీడియాలో జాన్వీకి మాములు క్రేజ్ లేదు. జాన్వీని ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 2 కోట్లకుపైగా మంది ఫాలో అవుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో జాన్వీ బ్రాండ్ ఇమేజ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది.
View this post on Instagram
జాన్వీ కపూర్‌తో తమ బ్రాండ్స్‌ను ప్రమోట్ చేసుకోవడానికి పెద్ద పెద్ద కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఈ బ్యూటీ ఇలా పోస్ట్ చేస్తే చాలు లక్షల్లో లైక్‌లు కురుస్తుంటాయి. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వైట్ శారీలో కొంటె చూపుతో కవ్విస్తోన్న జాన్వీ కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది. ఈ ఫొటోలతో పాటు ఎగురుతోన్న పావురం ఎమోజీని జోడించింది జాన్వీ. ఈ ఫొటో చూసిన అభిమానులు అతిలోక సుందరి శ్రీదేవి తనయ అంటే ఈ మాత్రం ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..