Balakrishna: నందమూరి వర్సెస్ అక్కినేని.. బాలయ్య వ్యాఖ్యలతో ఇండస్ట్రీలో రాజుకున్న కొత్త చిచ్చు.
నట సింహం బాలకృష్ణ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో కొత్త చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో పాల్గొన్న బాలకృష్ణ ఏఎన్‌ఆర్, ఎస్‌వీ రంగారావులను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నారు. బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలతో వారసుల..
నట సింహం బాలకృష్ణ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో కొత్త చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో పాల్గొన్న బాలకృష్ణ ఏఎన్‌ఆర్, ఎస్‌వీ రంగారావులను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నారు. బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలతో వారసుల మధ్య వార్ మొదలైంది. నందమూరి, అక్కినేని కుటుంబాల మధ్య టాలీవుడ్‌లో మళ్లీ రచ్చ మొదలైంది. ANR, SV రంగారావు గురించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు అక్కినేని నట వారసులు కౌంటర్ ఇవ్వడంతో ఇండస్ట్రీలో చిచ్చు రాజుకుంది.
వీర సింహారెడ్డి విజయోత్సం వేడుకలో బాలకృష్ణ చేసిన కామెంట్స్ పై అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ రియాక్ట్ అయ్యారు. ఇద్దరూ వేర్వేరు పేర్లతో ఒకే సందేశాన్ని విడుదల చేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, రంగారావు కళామతల్లి ముద్దుబిడ్డలనీ, అలాంటి వారిని అవమానించటం అంటే మనల్ని మనం కించపరుచుకోవటమే అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎప్పుడూ సరదాగా మాట్లాడే బాలకృష్ణ- పొరపాటుగానో లేక నోరుజారారో తెలియదుగానీ, టాలీవుడ్ దిగ్గజాలపై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. ‘అక్కినేని…తొక్కినేని, ఆ రంగారావు…ఈ రంగారావు’ అంటూ కామెంట్స్ చేశారు. మేం ఎప్పుడు కలిసినా వాళ్లపైనే టైంపాస్ డిస్కషన్స్ అంటూ నోరు జారారు బాలయ్య.
దీంతో బాలకృష్ణకి కౌంటర్‌గా అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన రియాక్షన్ కీలకంగా మారింది. ఈ ప్రకటనలో అక్కినేని అన్నదమ్ములిద్దరూ చాలా మర్యాదగా స్పందించారు. బాలకృష్ణ ప్రస్తావించిన అక్కినేని, రంగారావు పేర్లతోపాటు ఎన్టీఆర్ పేరును కూడా ప్రస్తావించారు. మాటకు మాట అన్నట్లుగా కాకుండా స్పందనగా మాత్రమే కనిపిస్తోంది. బాలకృష్ణ వ్యాఖ్యలను తొలుత అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సర్వేశ్వరరావు ఖండించారు. అక్కినేని నాగేశ్వరరావును కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. బాలకృష్ణది అహంకారపూరిత అవలక్షణంగా భావించాల్సి వస్తుందని తప్పుబట్టారాయన. అక్కినేని కుటుంబానికి బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలంటూ సర్వేశ్వరరావు డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే బాలకృష్ణ వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యాన్స్ నుంచి, ఆయన కుటుంబం నుంచి స్పందనలు వచ్చాయి. అయితే టాలీవుడ్ ప్రముఖులు ఎవరూ దీనిపై ఇంతవరకు స్పందించలేదు. ఈ అంశం మరింత వివాదంగా మారకముందే సినీ పెద్దలు అడుగు ముందుకు వేస్తారా అన్నదే ఆసక్తిగా మారింది. బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగార్జున నేరుగా స్పందించలేదు. నాగార్జున కుటుంబం నుంచి ఆయన ఇద్దరు కొడుకులు మాత్రమే స్పందించారు. నాగార్జున స్పందిస్తారా లేదా అన్నది హాట్‌టాపిక్ అయింది.
గతంలోనూ..
ఇక బాలకృష్ణ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు గతంలోనూ దేవాంగులపై కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దేవాంగులకూ రావణబ్రహ్మకూ సంబంధముందంటూ.. వ్వాఖ్యానించారు. దీనిపై దేవబ్రాహ్మణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన బాలయ్య వెంటనే రియాక్టయ్యారు. ఇది పొరబాటున దొర్లిన తప్పుగా చెప్పుకొస్తూ ఒక నోట్ రిలీజ్ చేశారు. దేవాంగుల్లో తనకు చాలా మంది అభిమానులుంటారనీ. తన వారిని తానెందుకు బాధ పెట్టుకుంటానని పశ్చాతాపంతో కూడిన ప్రకటన చేశారు. అక్కినేని విషయంలో కూడా బాలకృష్ణ ఇలాగే స్పందిస్తారా అన్నది కీలకంగా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..