Nandamuri Balakrishna: అమాయకులపై కేసులు బుక్ చేయడం ఇప్పుడు చాలా ఈజీ.. బాలయ్య కామెంట్స్ వైరల్
జనరల్‌గా మాట్లాడారో లేక పర్టిక్యుల్‌గా తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడారో తెలియదు కానీ, సంచలన వ్యాఖ్యలే చేశారు.
గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా వీరసింహారెడ్డిగా గర్జించారు. బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మాసియస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వీరసింహారెడ్డి’ వీరమాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మించిన ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా జనవరి 12న వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై.. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, అన్ని చోట్ల రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధించి బాలకృష్ణ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా వీరసింహుని విజయోత్సవం వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకలో బాలకృష్ణ చేతుల మీదగా చిత్ర యూనిట్ కు మెమెంటో ప్రధాన కార్యక్రమం జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ముఖ్యంగా పోలీస్ కేసులపై నందమూరి బాలకృష్ణ హాట్ కామెంట్స్ చేశారు. జనరల్‌గా మాట్లాడారో లేక పర్టిక్యుల్‌గా తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడారో తెలియదు కానీ, సంచలన వ్యాఖ్యలే చేశారు. నిరపరాధులపై, అమాయకులపై కేసులు బుక్ చేయడం ఇప్పుడు చాలా ఈజీ అన్నారు. చేయని తప్పులకు కూడా పోలీస్‌స్టేషన్‌లో పడేస్తున్నారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అంతేకాదు, గతంలో చేసిన చిన్న తప్పులకు కూడా ఇప్పుడు కేసులు పెడతారేమో అంటూ సెటైర్లు వేశారు బాలయ్య.
పొరపాటున అన్నారో లేక నోరు జారారో తెలియదుగాని టాలీవుడ్ దిగ్గజాలపై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు బాలయ్య. అక్కినేని.. తొక్కినేని, ఆ రంగారావు.. ఈ రంగారావు అంటూ కామెంట్స్ చేశారు. మేం ఎప్పుడు కలిసినా వాళ్లపైనే టైంపాస్ డిస్కషన్స్ అంటూ నోరు జారారు బాలయ్య. ఇప్పుడు ఈ కామెంట్స్ ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.