Kamal Haasan – Mani Ratnam: లెజెండ్స్ కాంబోలో మరో కల్ట్ క్లాసిక్ మూవీ.. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటో తెలిస్తే పూనకాలే
లాంగ్ గ్యాప్ తరువాత విక్రమ్ సినిమాతో బిగ్ హిట్ అందుకున్నారు కమల్ హాసన్. ఈ సక్సెస్ కమల్ మీద కోలీవుడ్ మేకర్స్ లో కాన్ఫిడెన్స్ పెంచింది. అందుకే మాస్టర్ మేకర్ మణిరత్నం దాదాపు నాలుగున్నర దశాబ్దాల తరువాత కమల్‌తో మూవీకి రెడీ అవుతున్నారు.
లోకనాయకుడు కమల్ హాసన్, గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్‌లో దశాబ్దాల తరువాత ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రజెంట్ కమల్‌తో పాటు మణిరత్నం కూడా సూపర్ ఫామ్‌లో ఉండటంతో ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అందుకు తగ్గట్టుగా బిగ్ కాస్టింగ్‌తో భారీగా సినిమాను ప్లాన్ చేస్తున్నారు మణి – కమల్. లాంగ్ గ్యాప్ తరువాత విక్రమ్ సినిమాతో బిగ్ హిట్ అందుకున్నారు కమల్ హాసన్. 60 ప్లస్ ఏజ్‌లోనూ యాక్షన్ హీరోగా కనిపించి ఆకట్టుకున్నారు. ఈ సక్సెస్ కమల్ మీద కోలీవుడ్ మేకర్స్ లో కాన్ఫిడెన్స్ పెంచింది. అందుకే మాస్టర్ మేకర్ మణిరత్నం దాదాపు నాలుగున్నర దశాబ్దాల తరువాత కమల్‌తో మూవీకి రెడీ అవుతున్నారు.
ప్రజెంట్ మణిరత్నం కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పొన్నియిన్ సెల్వన్ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు మణి. వన్స్ పీఎస్ 2 రిలీజ్ అయితే కమల్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ షూరు అవుతుంది. 1987లో కమల్ – మణిరత్నం కాంబినేషన్‌లో నాయకుడు సినిమా రిలీజ్ అయ్యింది. మణి టేకింగ్, కమల్ అద్భుతమైన నటనతో ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. అప్పట్లోనే ఆస్కార్ బరిలో నిలిచే సత్తా ఉన్న సినిమాగా పేరు తెచ్చుకుంది నాయకుడు.
ఇన్నేళ్ల తరువాత కమల్ – మణి కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే ఆ అంచనాలను రీచ్ అయ్యే రేంజ్ కాంబినేషన్ సెట్ చేస్తున్నారు మణి. కమల్‌తో పాటు ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కీలక పాత్రలో నటించబోతున్నారు. ప్రస్తుతానికి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ లేకపోయినా.. ప్రజెంట్ ఇండస్ట్రీ సిచ్యుయేషన్, కమల్ – మణిల ఫామ్ చూస్తే ఈ కాంబో సెట్ చేయటం పెద్ద విషయమేం కాదనిపిస్తుంది. అదే జరిగితే… ఇండియన్ స్క్రీన్ మీద ఇదే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ అవుతుందంటున్నారు క్రిటిక్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..