Maheshwari: గులాబీ ముద్దుగుమ్మ మహేశ్వరి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. ఎంతలా మారిపోయిందో!!
కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ఒక మాస్టర్ పీస్. ఈ సినిమాలో జేడీ చక్రవర్తి, మహేశ్వరి హీరో హీరోయిన్స్ గా నటించారు.
కొన్నిసినిమాలు ఎన్ని ఏళ్ళు గడిచినా గుర్తుండిపోతాయి.. అలా గుర్తుండిపోయే సినిమానే గులాబీ. కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ఒక మాస్టర్ పీస్. ఈ సినిమాలో జేడీ చక్రవర్తి, మహేశ్వరి హీరో హీరోయిన్స్ గా నటించారు. అందమైన ప్రేమ కథతో పాటు థ్రిల్లింగ్ యాక్షన్ సీన్స్ తో ఉండే ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు ఇప్పటికి శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో నటించిన మహేశ్వరి అప్పట్లో కుర్రాళ్ళ కలల రాకుమారి. చూడచక్కని రూపం, చలాకీతనంతో ఆకట్టుకుంది మహేశ్వరి. ముఖ్యంగా ఈ అమ్మడి వాయిస్ కు పడిపోని కుర్రాళ్ళు ఉండరేమో..
అందాల తార శ్రీదేవికి మహేశ్వరి దగ్గరి బంధువు. ఈమె తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేసి అలరించింది. ప్రస్తుతం మహేశ్వరి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆమె ఇప్పుడు ఎలా ఉన్నారని చాలా మంది నెటిజన్లు గూగుల్ గాలిస్తున్నారు. అయితే మహేశ్వరి ఇప్పుడు ఎలా ఉందొ తెలుసా.?
మహేశ్వరి చివరిగా తిరుమల తిరుపతి వెంకటేశ సినిమాలో కనిపించింది. ఆమె 2000లో తన కెరీర్‌లో పీక్‌లో ఉన్నప్పుడు చిత్ర పరిశ్రమను విడిచిపెట్టింది. ఆమె 2008లో తిరుపతిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన జయకృష్ణను వివాహం చేసుకుంది.తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేశ్వరి ఒక సంవత్సరం క్రితం అలీతో సరదాగా అనే షోకు హాజరయ్యారు. అప్పటి ఆమె ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోస్ పై మీరూ ఓ లుక్కేయండి.