Naga Chaitanya: అలా చేస్తే మనల్ని మనం కించపరుచుకోవటమే.. బాలకృష్ణ కామెంట్స్‌పై నాగ చైతన్య రియాక్షన్..
వీర సింహుని విజయోత్సవ వేడుకలో బాలకృష్ణ చేసిన కామెంట్స్ పై అక్కినేని నాగచైతన్య రియాక్ట్ అయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, రంగారావు గారిలాంటి వారిని అవమానించటం అంటే

వీర సింహారెడ్డి విజయోత్సవ వేడుకలో బాలకృష్ణ చేసిన కామెంట్స్ పై అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ రియాక్ట్ అయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, రంగారావు గారిలాంటి వారిని అవమానించటం అంటే మనల్ని మనం కించపరుచుకోవటమే అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే నాగ చైతన్య.. అఖిల్.. బాలయ్య కామెంట్స్ మీద స్పందించటంపై టాలీవుడ్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ఇటీవల వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలకృష్ణ ఏఎన్ఆర్ పై పలు వ్యాఖ్యలు చేశారు. అప్పటినుంచి సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు బాలయ్య టార్గెట్ గా కామెంట్లు చేస్తున్నారు.
వీరసింహారెడ్డి విజయోత్సవ సక్సెస్ మీట్‌లో ఫుల్ జోష్‌లో మాట్లాడిన బాలయ్య.. సడెన్‌గా సినిమాలో ఆర్టిస్టుల గురించి ప్రస్తావించారు. తమ మధ్య రకరకాల విషయాలు చర్చకు వస్తాయి.. నాన్న గారు, ఆ డైలాగులు, రంగారావు గారు, ఈ అక్కినేని.. అంటూ పలు వ్యాఖ్యలు చేశారు. పాత సినిమాలకు సంబంధించిన చాలా విషయాలు చర్చించుకున్నామని చెప్పే క్రమంలో అక్కినేని.. అంటూ బాలయ్య మాట్లాడారు.




— chaitanya akkineni (@chay_akkineni) January 24, 2023
— Akhil Akkineni (@AkhilAkkineni8) January 24, 2023
అయితే, ఈ వీడియో వైరల్ అవ్వడంతో అక్కినేని ఫ్యాన్స్ బాలయ్యపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో అక్కినేని వారసుడు నాగచైతన్య మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం..