Viral Video: ‘గంగ్నమ్ స్టైల్’ గుర్తుందా..? సై పాటకు దుమ్ములేపే స్టెప్పులేసిన అమ్మాయి.. చూస్తే అవాక్కవ్వాల్సిందే.

ఒకప్పుడు సెన్సెషనల్.. ఇప్పుడు కూడా ఆ పాట వింటే.. కాళ్లు కదిలించక తప్పదు.. అదే.. సై- గంగ్నమ్ స్టైల్ పాట.. ఈ పాటకు ఎంత క్రేజ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..

Viral Video: ‘గంగ్నమ్ స్టైల్’ గుర్తుందా..? సై పాటకు దుమ్ములేపే స్టెప్పులేసిన అమ్మాయి.. చూస్తే అవాక్కవ్వాల్సిందే.
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 23, 2023 | 12:08 PM

ఒకప్పుడు సెన్సెషనల్.. ఇప్పుడు కూడా ఆ పాట వింటే.. కాళ్లు కదిలించక తప్పదు.. అదే.. సై- గంగ్నమ్ స్టైల్ పాట.. ఈ పాటకు ఎంత క్రేజ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. తాజాగా.. ఓ యువతి గగ్నమ్ స్టైల్ పాటకు స్టెప్పులేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా ఇంటర్నెట్‌లో చాలా వీటియోలు వైరల్ అవుతుంటాయి. ఎందుకంటే ఇవి నెటిజన్లను తెగ ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. దీంతోపాటు.. కొన్ని వీడియోలతో కొందరు రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో సెలబ్రిటీలుగా మారుతారు.. అయితే.. అత్యంత రద్దీగా ఉన్న ఓ వీధిలో ‘గంగ్నమ్ స్టైల్’ పాటకు నృత్యం చేసిన యువతి నెట్టింట తెగ వైరల్ అయ్యింది. వీడియోలో ఉన్న అమ్మాయి భూమి గాంధీగా పేర్కొంటున్నారు. ఈ వీడియోను ఆమె అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన తర్వాత.. నెట్టింట గంగ్నమ్ అంటూ రచ్చచేస్తోంది.

వైరల్ అయిన వీడియోలో నడి రోడ్డుపైనున్న యువతి.. ‘గంగ్నమ్ స్టైల్’ అనే హిట్ కొరియన్ పాటకు స్టేప్పులేస్తుంది. అదిరిపోయే స్టెప్పులతో అందరి మనసులను దోచుకుంది. ఆమె డ్యాన్స్ అద్భుతంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒక డ్రింక్ తాగిన తర్వాత భూమి రెచ్చిపోయి డ్యాన్స్ వేయడాన్ని వీడియోలో చూడవచ్చు.. ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసిన భూమి.. “మీకు మ్యాజికల్ డ్రింక్ కూడా కావాలా?” అంటూ నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో..

ఈ వీడియోను క్లిప్‌ పంచుకున్నప్పటి నుంచి 4,500 లైక్‌లు వచ్చాయి. ఇండా వాటి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. నెటిజన్లు అమ్మాయి నృత్యానికి ముగ్ధులవుతున్నారు. అద్భుతంగా ఉందని.. డ్యాన్స్ చూస్తే మతి పోతుందంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..