AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wedding: మరికాసేపట్లో పెళ్లి.. ఆ చిన్న పని కూడా చేయలేకపోయిన వరుడు.. వధువు షాకింగ్ నిర్ణయం..

మరికాసేపట్లో వివాహం.. వరుడు బరాత్ సందడి నడుమ బంధువులతో కలిసి వధువు గ్రామానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో వధువు తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కు గురిచేసింది.

Wedding: మరికాసేపట్లో పెళ్లి.. ఆ చిన్న పని కూడా చేయలేకపోయిన వరుడు.. వధువు షాకింగ్ నిర్ణయం..
Wedding
Shaik Madar Saheb
|

Updated on: Jan 22, 2023 | 1:21 PM

Share

మరికాసేపట్లో వివాహం.. వరుడు బరాత్ సందడి నడుమ బంధువులతో కలిసి వధువు గ్రామానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో వధువు తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కు గురిచేసింది. డబ్బులు లెక్కించలేకపోయాడని.. తెలుసుకున్న వధువు పెళ్లికి నిరాకరించింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫరూఖాబాద్ జిల్లాలోని మహ్మదాబాద్ కొత్వాలి ప్రాంతంలోని ఓ గ్రామంలో పెళ్లి వేడుక జరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయం ప్రకారం.. వధువు సోదరుడు ఇచ్చిన 2100 నగదును వరుడు లెక్కించలేకపోయాడు.

ఈ విషయం తెలుసుకున్న వధువు.. ఇలాంటోడు తనకు అస్సలు వద్దంటూ తేల్చి చెప్పింది. పెళ్లి క్యాన్సిల్ చేయాలంటూ కుటుంబసభ్యులను కోరింది. దీంతో వధువు కుటుంబసభ్యులు ఈ వివాహ వేడుకను నిలిపివేశారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య వివాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరుకుటుంబాల మధ్య సయోధ్య కోసం ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. పెళ్లికి వధువు బంధువులు నిరాకరిస్తూ తేల్చిచెప్పడంతో ఇరువర్గాల మధ్య పోలీస్ స్టేషన్‌లో పంచాయితీ జరిగింది. చివరకు పంచాయితీ అనంతరం వధువు లేకుండానే బరాత్ తిరిగి వరుడి గ్రామానికి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు.

కొత్వాలి ప్రాంతంలోని దుర్గ్‌పూర్ గ్రామానికి చెందిన అమ్మాయితో.. మెయిన్‌పురి పోలీస్ స్టేషన్‌ పరిధిలోని బాబినా గ్రామానికి చెందిన అబ్బాయితో వివాహం నిశ్చయమైంది. వివాహం రోజున వరుడు బరాత్ తో గ్రామానికి వచ్చాడు. ఈ సమయంలో తిలకం ఉత్సవం పూర్తయిన తర్వాత, వరుడికి ఏమీ తెలియదని కుటుంబసభ్యులు వధువుకు చెప్పడంతో పెళ్లికి బ్రేక్ పడినట్లు పోలీసులు తెలిపారు. వధువు తరఫు వారు ఇచ్చిన డబ్బును వరుడు సరిగా లెక్కించకపోవడమే దీనికి కారణమని పోలీసులు వెల్లడించారు. కాగా.. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..