AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో.. మరీ ఇంత ధైర్యం వద్దు బ్రో.. కాస్త తేడా అయితే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయ్..

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా, భయంకరంగా ఉంటాయి. తాజాగా, నెట్టింట ఓ భయంకరమైన వీడియో వైరల్ అవుతోంది.

Viral Video: వామ్మో.. మరీ ఇంత ధైర్యం వద్దు బ్రో.. కాస్త తేడా అయితే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయ్..
Viral Video
Shaik Madar Saheb
|

Updated on: Jan 21, 2023 | 9:02 PM

Share

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా, భయంకరంగా ఉంటాయి. తాజాగా, నెట్టింట ఓ భయంకరమైన వీడియో వైరల్ అవుతోంది. సాధారణంగా మొసలికి ఆహారాన్ని దూరం నుంచి అందిస్తారు. కానీ.. ఓ వ్యక్తి నీటిలో ఉన్న మొసలికి ఆహారాన్ని అందించిన తీరు అందర్ని భయాందోళనకు గురిచేస్తోంది. కుక్కపిల్లలు, పిల్లులు, పక్షులు వంటి చిన్న పెంపుడు జంతువులకు సంబంధించిన అనేక వీడియోలను మీరు చూసే ఉంటారు. ఇవన్నీ సాదుజంతువుల కిందకు వస్తాయి.. మనుషులతో కూడా కలిసిమెలసి ఉంటాయి. అయితే, మొసలి వంటి ప్రమాదకరమైన జంతువులకు దూరంగా ఉండటమే మంచిది. కానీ, ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి మొసలికి మాంసం ముక్కను తినిపిస్తున్న దృశ్యం ప్రస్తుతం.. నెట్టింట వైరల్‌గా మారి నెటిజన్లను పిచ్చెక్కించింది.

ఈ వైరల్ వీడియోలో మీరు శ్రద్ధగా గమనిస్తే.. ఒక వ్యక్తి తన మోకాళ్ల మధ్య మొసలిని పట్టుకుని మాంసం ముక్కను తినిపిస్తున్న దృశ్యాన్ని మీరు చూడవచ్చు. ఆ మనిషిని చూసిన మొసలి.. తన దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత మొసలిని రెండు కాళ్ల మధ్యలోకి తీసుకుని.. మాంసం ముక్కను అందిస్తాడు. ఆహారం ఇచ్చిన తర్వాత అతను మొసలిని నీటిలోకి ఈదడానికి వదిలేస్తాడు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్‌లో Lance అనే యూజర్ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే వీడియో 3.9 మిలియన్లకు పైగా వీక్షణలు, 54.3 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. తన జీవితంలో ఇలాంటి స్నేహపూర్వక మొసలిని చూడలేదంటూ నెటిజన్లు షాకవుతున్నారు. కొంచెం అటు ఇటైనా జీవితం ప్రమాదంలో పడుతుందని.. ఇలాంటి జంతువులకు దూరంగా ఉండాలంటూ సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్