Kantara-2 Movie: సినిమా ప్రియులకు అదిరిపోయే న్యూస్‌.. త్వరలోనే పట్టాలెక్కనున్న కాంతారా-2 మూవీ..

శాండల్‌వుడ్‌ (కన్నడం) లో చిన్న సినిమాగా విడుదలైన కాంతారా అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రిషబ్ శెట్టి స్వీయ దర్శకుడిగా, హీరోగా వ్యవహరించిన కాంతారా సినిమా విడుదలైన 15 రోజుల్లోనే..

Kantara-2 Movie: సినిమా ప్రియులకు అదిరిపోయే న్యూస్‌.. త్వరలోనే పట్టాలెక్కనున్న కాంతారా-2 మూవీ..
Kantara Movie
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 21, 2023 | 4:17 PM

శాండల్‌వుడ్‌ (కన్నడం) లో చిన్న సినిమాగా విడుదలైన కాంతారా అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రిషబ్ శెట్టి స్వీయ దర్శకుడిగా, హీరోగా వ్యవహరించిన కాంతారా సినిమా విడుదలైన 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ సంపాదించింది. పలు భాషల్లో విడుదలై కోట్లాది రూపాయల వసూళ్లను రాబట్టింది. అయితే, దీనికి సిక్వెల్ ఉంటుందా లేదా అనే దానిపై ఎప్పటినుంచో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కాంతారా మూవీ యూనిట్‌ సినీ ప్రియులందరికీ గుడ్ న్యూస్‌ చెప్పింది. కాంతారా 2 సిక్వెల్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న అభిమానులకు అప్‌డేట్‌ ఇచ్చింది. ‘కాంతార’ సినిమా పార్ట్‌-2 రానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ వ్యవస్థాపకుడు విజయ్‌ శనివారం వెల్లడించారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ‘కాంతార’ పార్ట్‌2 పై క్లారిటీ ఇచ్చారు. కాంతార-2కు తాము ప్రణాళికలు సిద్ధం చేశామని.. రిషబ్‌శెట్టి ఇప్పటికే సినిమాకు సంబంధించిన పనులు మొదలుపెట్టారంటూ పేర్కొన్నారు. జూన్‌లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ప్రకటించారు. దీనికోసం పలు ప్రాంతాలను కూడా అన్వేషించినట్లు సమాచారం..

సినిమాలోని కొన్ని సీన్స్‌ వర్షాకాలం నేపథ్యంలోనే ఉండేటట్లు ప్లాన్‌ చేశామని తెలిపారు. అందుకే జూన్‌ నెల నుంచి చిత్రీకరణ మొదలు పెట్టాలనుకుంటున్నామని తెలిపారు. పాన్‌ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్‌ లేదా మేలో కాంతారా 2 మూవీని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేసినట్లు వెల్లడిచంఆరు. అయితే ఇది ‘కాంతార’కు సీక్వెల్‌ కాదని ప్రీక్వెల్‌’’ అంటూ విజయ్‌ ఇంటర్వ్యూలో చెప్పడం ఆసక్తికరంగా మారింది.

తుళునాడులోని భూతకోల నేపథ్యంలో ‘కాంతార’ సినిమా తెరకెక్కింది. రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. రానున్న ప్రీక్వెల్‌లో ఏం చూపించనున్నారనే విషయంలో ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. దీనిలో కథానాయకుడు, ఆయన తండ్రి అడవిలోని ఓ ప్రాంతంలో ఎందుకు మాయమైపోయారన్న విషయాన్ని చూపిస్తారని ప్రచారం మొదలైంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో రిషబ్ శెట్టి మరింత విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.