AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakul Preet Singh: ఆ సమయంలో కారులోనే బట్టలు మార్చునేదాన్ని.. రకుల్ ప్రీత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

హీరోయిన్ గా పరిచయం అయిన తక్కువ సమయంలోనే మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. వరుస ఆఫర్లతో టాలీవుడ్‌లో అప్పటి బ్యూటీస్ కి గట్టిపోటీ ఇచ్చింది.

Rakul Preet Singh: ఆ సమయంలో కారులోనే బట్టలు మార్చునేదాన్ని.. రకుల్ ప్రీత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Rakul Preet Singh
Rajeev Rayala
|

Updated on: Jan 21, 2023 | 4:25 PM

Share

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్‌గా రాణించింది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. హీరోయిన్ గా పరిచయం అయిన తక్కువ సమయంలోనే మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. వరుస ఆఫర్లతో టాలీవుడ్‌లో అప్పటి బ్యూటీస్ కి గట్టిపోటీ ఇచ్చింది. ఇక వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. అలాగే స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకుంది. దాదాపు అందరు టాప్ హీరోలతో జతకట్టింది రకుల్ ప్రీత్. ఇక ఇటీవల కాలంలో రకుల్ జోరు తగ్గిందనే చెప్పాలి. ఈ అమ్మడుకు తెలుగుతో పాటు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి అలరించింది. ఇక ఇప్పుడు తెలుగులో మాత్రం తక్కువ సినిమాలు చేస్తోంది.

కాగా రకుల్ చివరిసారిగా తెలుగులో కొండపొలం సినిమాలో కనిపించింది.  ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ఛత్రివాలి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదే కాకుండా ఈ ముద్దుగుమ్మ చేతిలో రెండు భారీ బడ్జెట్ తమిళ్ సినిమాలున్నాయి. అలాగే పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కాంబోలో రాబోతున్న ఇండియన్ 2 సినిమాలోనూ నటిస్తోంది. తాజాగా రకుల్ తన కెరీర్ బిగింనింగ్ డేస్ గురించి.. స్ట్రగుల్స్ గురించి గుర్తు చేసుకుంది.

ఇండస్ట్రీలో నేను ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చాను.. ఛాన్స్ లకోసం ఆడిషన్స్ కు వెళ్లేదాన్ని. రోజుకు ఐదు నుంచి పది ఆడిషన్స్ ఇచ్చేదాన్ని.. బ్యాగ్ లో బట్టలు పెట్టుకొని ఛాన్స్‌లకోసం తిరిగాను.. ఆ సమయంలో కారులోనే బట్టలు మార్చుకునేదాన్ని.. ఒకసారి నన్ను ఓ సినిమాకు సెలక్ట్ చేసి షూటింగ్ చేసి ఆ తర్వాత హీరోయిన్ ను మార్చేశారు అని చెప్పుకొచ్చింది. కానీ దాన్ని నేను పోరాడుతున్నా అని అనుకోలేదు. పోరాటం అనే పదాన్ని నేను ఒప్పుకోనూ.. కష్టపడకుండా ఏదీ ఈజీగా రాదు అని నేను నమ్ముతాను.. ఆత్మవిశ్వసంతో అడుగులు వేశాను కాబట్టే ఇప్పుడు ఈ పొజీషన్ లో ఉన్నా అని తెలిపింది రకుల్.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!