Beer: బీర్ తాగితే కిడ్నీలోని రాళ్లు కరుగుతాయా.. నిపుణులు ఏమంటున్నారో తెలుసా..

చాలామంది బీర్ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, కొంతమంది బీర్ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయని భావిస్తుంటారు. అలాంటి వారిలో మీరు కూడా ఉంటే ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి..

Beer: బీర్ తాగితే కిడ్నీలోని రాళ్లు కరుగుతాయా.. నిపుణులు ఏమంటున్నారో తెలుసా..
Beer
Follow us

| Edited By: Basha Shek

Updated on: Jan 23, 2023 | 9:40 PM

చాలామంది బీర్ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, కొంతమంది బీర్ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయని భావిస్తుంటారు. అలాంటి వారిలో మీరు కూడా ఉంటే అలెర్ట్ అవ్వాల్సిందే.. ఎందుకంటే అది కేవంల అపోహ మాత్రమేనట.. ఇంకా దీనిని మీరు నమ్మకపోతే.. మీ ఇష్టం అంటున్నారు నిపుణులు.. బీర్ తాగితే కిడ్నీల్లో ఉన్న రాళ్లు బయటకు పోవని.. ఇది కేవలం భ్రమ మాత్రమేనంటూ స్పష్టంచేస్తున్నారు. ఈ వాదనలో ఎంత నిజం ఉందో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.. అమెరికన్ అడిక్షన్ సెంటర్ నివేదిక ప్రకారం.. బీర్ (ఆల్కహాల్) తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు బయటకు వస్తాయని ఎటువంటి ఆధారాలు లేవు. కానీ మీరు కిడ్నీలో రాళ్లను తొలగించే ప్రక్రియలో పదేపదే బీర్ తాగుతూ ఉంటే.. అది మూత్రపిండాల సమస్యలు, మూత్రపిండాల వైఫల్యం, రక్తపోటు, క్యాన్సర్, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ వంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. బీర్ తాగడం వల్ల తరచుగా మూత్రవిసర్జన వస్తుందని, అప్పుడు శరీరం నుంచి రాయి బయటకు రావడం తేలికవుతుందని చాలామంది భావిస్తుంటారు. ఆల్కహాల్ అయినా, బీర్ అయినా.. కిడ్నీలో రాళ్లను బయటకు తీయడంలో ఏదీ సాహాయపడదని ఏసీసీ నివేదికలో స్పష్టంగా పేర్కొంది. దీని కోసం మీరు శస్త్రచికిత్స చేయించుకోవాలి లేదా మీ వైద్యుడిని సంప్రదించి మందులను తీసుకోవడం మంచిది. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒక చుక్క ఆల్కహాల్‌ కూడా ప్రమాదకరమైనదిగా పరిగణించింది.

మద్యం – కిడ్నీ సమస్యలకు సంబంధించిన కొన్ని విషయాలను వైద్యులు పలు అధ్యయనాల్లో స్పష్టంగా వివరించారు. మూత్రవిసర్జనను పెంచడానికి బీర్ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ విధంగా చిన్న రాళ్లను తీయడం సాధ్యమవుతుంది. కానీ అది 5 మిమీ కంటే పెద్ద రాళ్లను బయటకు తీయలేదు. ఎందుకంటే పెరుగుదల మార్గం సుమారు 3 మిమీ ఉంటుంది. మూత్రపిండాల్లో నొప్పిగా ఉన్నప్పుడు లేదా మూత్ర విసర్జన చేయలేనప్పుడు మీరు బీర్ తాగితే, అది మీ పరిస్థితిని మరింత దిగజార్చుతుందని కూడా నివేదించారు. బీర్ ఎక్కువ మూత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. అందువలన ఇది చాలా బాధాకరంగా మారుతుంది. అధిక వినియోగం కూడా డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది.

కిడ్నీలో రాళ్లు ఎందుకు వస్తాయి?

మనందరికీ తెలిసినట్లుగా.. కిడ్నీ మొదటి విధి రక్తాన్ని శుభ్రపరచడం.. దాని నుంచి టాక్సిన్స్, అనవసరమైన పోషకాలను మూత్రం ద్వారా తొలగిస్తుంది. కానీ రక్తంలో విషపూరిత మూలకాల పరిమాణం పెరిగినప్పుడు, కిడ్నీ దానిని సరిగ్గా ఫిల్టర్ చేయదు. దీంతో సమస్యలు ప్రారంభమవుతాయి. సరిగా ఫిల్టర్ చేయనప్పుడు.. ఘన రూపంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. కిడ్నీలో రాళ్లు ఆమ్ల లవణాలతో తయారవుతాయి. దీని ప్రారంభ లక్షణం పొత్తికడుపులో ఒక వైపు లేదా ( వీపు )వెనుక భాగంలో ఆకస్మిక నొప్పి.. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం వల్ల మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి లేదా మంటగా అనిపిస్తే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం..