AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garlic Benefits: శీతాకాలంలో వెల్లుల్లితో బోలెడు ప్రయోజనాలు.. ఆ సమస్యలకు సులువుగా చెక్‌ పెట్టొచ్చు

వంటలకు రుచిని, సువాసను అందించే వెల్లుల్లిలో విటమిన్ సి, ఫోలేట్, నియాసిన్, థయామిన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి

Garlic Benefits: శీతాకాలంలో వెల్లుల్లితో బోలెడు ప్రయోజనాలు.. ఆ సమస్యలకు సులువుగా చెక్‌ పెట్టొచ్చు
Garlic
Basha Shek
|

Updated on: Jan 23, 2023 | 7:56 AM

Share

పురాతన కాలం నుండి వెల్లుల్లిని వంటలలో ఉపయోగిస్తున్నారు. అంతేకాదు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండడతో దీనిని పలు ఔషధాలు, మందుల్లో విరివిగా వినియోగిస్తున్నారు. వంటలకు రుచిని, సువాసను అందించే వెల్లుల్లిలో విటమిన్ సి, ఫోలేట్, నియాసిన్, థయామిన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అధిక రక్తపోటు వివిధ అనారోగ్యాలకు మూలం. దీని ఫలితంగా గుండె పోటు, స్ట్రోక్‌ల వంటి హృదయ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి వారికి వెల్లుల్లి ఉత్తమమైన ఆహారం. ఇందులోని పోషకాలు రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. పచ్చి వెల్లుల్లిని ఆహారంలో చేర్చడం వల్ల జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఇది కడుపులో మంటను కూడా తగ్గిస్తుంది. ప్రేగులకు కూడా మంచిది. పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం వల్ల పేగుల్లోని పురుగులు తొలగిపోతాయి. పచ్చి వెల్లుల్లిని ఉపయోగించడం వల్ల జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు. రెండు వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి ఉదయాన్నే తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లి తీసుకోవడం వల్ల కాలేయం కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇది యాంటీ ఫంగల్, యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి వైరస్‌లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాల నుండి రక్షిస్తాయి. కాబట్టి ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం మంచిదంటారు నిపుణులు.

వెల్లుల్లి నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయని పరిశోధన ద్వారా నిరూపితమైంది. ఏదైనా నొప్పి, వాపు కీళ్ళు లేదా కండరాలపై కొద్దిగా వెల్లుల్లి నూనెను రాస్తే నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది. ఇక వెల్లుల్లిలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను తొలగించడం ద్వారా ముఖాన్ని శుభ్రపరుస్తాయి. వెల్లుల్లి తినడం క్యాన్సర్ నుండి రక్షించడంలో సహాయపడుతుందని అందులోని అనేక బయోయాక్టివ్ అణువులు క్యాన్సర్ కణాల విస్తరణను చంపుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వెల్లుల్లి అలాగే ఉల్లిపాయలలోని సమ్మేళనాలు మన ప్లేట్‌లెట్ స్టిక్కీనెస్‌ను తగ్గిస్తాయి. ఇవి గడ్డకట్టడాన్ని నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..