AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Gopal Varma: ‘రాజమౌళిని చంపడానికి కుట్ర’.. ఆర్జీవీ సంచలన ట్వీట్..

ఎస్. ఎస్. రాజమౌళి.. ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో చూసినా ఈ పేరు మారుమ్రోగిపోతోంది. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో జక్కన్న ఫేం..

Ram Gopal Varma: 'రాజమౌళిని చంపడానికి కుట్ర'.. ఆర్జీవీ సంచలన ట్వీట్..
Rgv & Rajamouli
Ravi Kiran
|

Updated on: Jan 24, 2023 | 3:28 PM

Share

ఎస్. ఎస్. రాజమౌళి.. ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో చూసినా ఈ పేరు మారుమ్రోగిపోతోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో జక్కన్న ఫేం ప్రపంచస్థాయికి చేరిపోయింది. ఈ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు మరికొన్ని అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఎక్కడ చూసినా రాజమౌళి పేరే.. డైరెక్టర్, నిర్మాత ఎవ్వరైనా కూడా జక్కన్నపై పొగడ్తలు కురిపించడమే.. అయితే ఈ విషయాన్ని కొంచెం వెరైటీగా చెప్పారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు రాజమౌళిని పొగుడుతుంటే.. ఇండియన్ డైరెక్టర్స్ మాత్రం అసూయతో రగిలిపోతున్నారని.. మిమ్మల్ని చంపేందుకు కుట్ర చేస్తున్నారంటూ.. ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే వర్మ.. పొలిటికల్ నుంచి సినిమా వరకు ఏ అంశాలు ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతున్నా.. వాటిపై తనదైన శైలిలో స్పందిస్తారు. ఇక ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ప్రపంచస్థాయిలో ప్రశంసలు దక్కడం.. రాజమౌళి ఖ్యాతి వరల్డ్‌వైడ్‌కు చేరడం.. జేమ్స్ కామెరాన్ వంటి దిగ్గజ దర్శకులు సైతం జక్కన్నను కలిసి మెచ్చుకోవడంతో.. ఈ అంశంపై అర్జీవీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘రాజమౌళి.. ప్రెజంట్ సిట్యువేషన్ ఎలా ఉందంటే.. మొగల్ ఏ అజామ్ తీసిన ఆసిఫ్, షోలే నిర్మించిన రమేష్ సిప్పీల నుంచి ఆదిత్య చోప్రా, కరణ్ జోహార్, భన్సాలీ వరకూ ప్రతి చిత్ర నిర్మాతనూ అధిగమించేశారని‘ ట్వీట్ చేశారు వర్మ.

అంతే కాదు మరో ట్వీట్‌లో ‘దయచేసి మీ భద్రత పెంచకోండి. భారత్‌లోని కొందరు ఫిల్మ్ మేకర్లు.. మీపై అసూయతో రగిలిపోతున్నారు. మిమ్మల్ని చంపడానికి ఒక టీమ్‌ని కూడా ఏర్పాటు చేశారు. ఇందులో నేను కూడా ఉన్నానంటూ’. తన ట్వీట్‌తో మరింత హీట్ పెంచారు వర్మ. తాను మత్తులో ఉండటం వల్లే.. ఈ రహస్యాన్ని బయట పెడుతున్నట్టు వర్మ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్
ఇంటి కోసం ఉద్యోగులకు EPFO సపోర్ట్‌..!
ఇంటి కోసం ఉద్యోగులకు EPFO సపోర్ట్‌..!