AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Red vs Yellow Watermelon: ఏ రంగు పుచ్చకాయ మంచిది? రంగుల వెనుక ఉన్న పోషక రహస్యాలు

పుచ్చకాయ అనగానే మనకు ఎరుపు రంగే గుర్తొస్తుంది. కానీ పసుపు రంగు పుచ్చకాయలు కూడా అంతే పురాతనమైనవి. నిజానికి, ఎరుపు రంగు పుచ్చకాయల కంటే ముందే పసుపు రంగువి సాగులో ఉండేవని చరిత్ర చెబుతోంది. ఈ రెండింటి మధ్య ప్రధాన వ్యత్యాసం వాటిలో ఉండే 'పిగ్మెంట్' (రంగునిచ్చే పదార్థం). ఎరుపు రంగు పుచ్చకాయలో 'లైకోపీన్' ఉంటే, పసుపు రంగు దానిలో 'బీటా కెరోటిన్' సమృద్ధిగా ఉంటుంది.

Red vs Yellow Watermelon: ఏ రంగు పుచ్చకాయ మంచిది? రంగుల వెనుక ఉన్న పోషక రహస్యాలు
Red Vs Yellow Watermelon.jpg
Nikhil
|

Updated on: Mar 18, 2026 | 6:35 AM

Share

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. రోడ్ల పక్కన ఎర్రటి పుచ్చకాయ ముక్కలు నోరూరిస్తుంటాయి. దేహాన్ని చల్లబరిచే అమృతంలా పుచ్చకాయ అందరికీ ఇష్టమైన పండు. అయితే, ఇటీవల మార్కెట్‌లో ఎరుపు రంగు పుచ్చకాయలతో పాటు పసుపు రంగు పుచ్చకాయలు కూడా సందడి చేస్తున్నాయి. వీటిని చూడగానే చాలామంది ఇవి కృత్రిమంగా పండించినవేమో అని భయపడుతుంటారు. కానీ, ఇవి కూడా ప్రకృతి సిద్ధంగా లభించేవే. మరి ఈ రెండు రంగుల పుచ్చకాయల్లో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది? వాటి వెనుక ఉన్న పోషక రహస్యాలేంటో వివరంగా తెలుసుకుందాం.

ఎరుపు రంగు పుచ్చకాయ

మనం రెగ్యులర్‌గా తినే ఎర్రటి పుచ్చకాయలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే ‘సిట్రుల్లైన్’ అనే అమైనో ఆమ్లం రక్తనాళాలను రిలాక్స్ చేసి, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఎండలో ఎక్కువగా తిరిగే వారికి లేదా వ్యాయామం చేసేవారికి వచ్చే కండరాల నొప్పులను తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఎండ వల్ల చర్మం దెబ్బతినకుండా కాపాడటంలో ఎర్రటి పుచ్చకాయ మేలు చేస్తుంది.

పసుపు రంగు పుచ్చకాయ

పసుపు పుచ్చకాయలో లైకోపీన్ ఉండదు, దానికి బదులుగా క్యారెట్లలో ఉండే బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరంలోకి వెళ్ళాక విటమిన్-ఏ గా మారుతుంది. విటమిన్-ఏ పుష్కలంగా ఉండటం వల్ల ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీర ఇమ్యూనిటీని పెంచడంలో పసుపు పుచ్చకాయ కీలక పాత్ర పోషిస్తుంది. ఎర్రటి కాయ కంటే పసుపు రంగుది కొంచెం ఎక్కువ తీయ్యగా, తేనె వంటి రుచితో ఉంటుంది.

ఏది మంచిది?

పుచ్చకాయ ఏదైనా.. దానిని పగటిపూట తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది. నిజానికి ఈ రెండింటిలోనూ 92 శాతం నీరే ఉంటుంది. కాబట్టి డీహైడ్రేషన్ సమస్యను తగ్గించడంలో రెండూ సమానంగానే పనిచేస్తాయి. మీకు గుండె ఆరోగ్యం ముఖ్యం అనుకుంటే ఎరుపు రంగును, కంటి చూపు మరియు రోగనిరోధక శక్తి కావాలనుకుంటే పసుపు రంగును ఎంచుకోవచ్చు. వీలైతే అప్పుడప్పుడూ రెండు రకాలను కలిపి తీసుకోవడం వల్ల అన్ని రకాల పోషకాలు శరీరానికి అందుతాయి. కానీ, పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగడం, రాత్రిపూట అతిగా తీసుకోవడం వంటివి జీర్ణక్రియపై ప్రభావం చూపుతాయి. ఈ వేసవిలో ఈ ప్రకృతి ప్రసాదిత పండ్లతో మీ శరీరాన్ని రీఛార్జ్ చేసుకోండి.

Follow Us