AP Entrance Exam Schedule 2023: ఆంధ్రప్రదేశ్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ 2023 విడుదల.. ఎంసెట్ పరీక్ష ఎప్పుడంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఏపీ ఈఏపీసెట్‌తోసహా వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి సెక్రటరీ నజీర్ అహ్మద్ సోమవారం (జనవరి 23) విడుదల చేశారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఏపీ ఈఏపీసెట్‌తోసహా వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి సెక్రటరీ నజీర్ అహ్మద్ సోమవారం (జనవరి 23) విడుదల చేశారు. తాజా షెడ్యూల్ ప్రకారం.. ఏపీ ఈఏపీసెట్-2023 పరీక్ష మే 15 నుంచి 25 వరకు నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షల ద్వారా వివిధ యూనివర్సిటీల్లో వివిధ కోర్సుల్లో యూజీ, పీజీ, పీహెచ్‌డీలలో ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రవేశ పరీక్షల పూర్తి షెడ్యూల్ ఇదే..
- ఏపీ ఈసెట్-2023 పరీక్ష మే 5
- ఏపీ ఈఏపీసెట్-2023 (ఎంపీసీ) స్ట్రీమ్ పరీక్ష మే 15 నుంచి 22 వరకు
- ఏపీ ఈఏపీసెట్-2023 (బైపీసీ) స్ట్రీమ్ పరీక్ష మే 23 నుంచి 25 వరకు
- ఏపీ ఐసెట్-2023 పరీక్ష మే 25 నుంచి 26 వరకు
- ఏపీ పీజీఈసెట్-2023 పరీక్ష మే 28 నుంచి 30 వరకు
- ఏపీ లాసెట్-2023 పరీక్ష మే 20న
- ఏపీ ఎడ్‌సెట్-2023 పరీక్ష మే 20న
- ఏపీ పీజీసెట్-2023 జూన్ 6 నుంచి 10 వరకు
- ఏపీ ఆర్‌సెట్ పరీక్ష జూన్ 12 నుంచి 14 వరకు
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.