Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC Recruitment 2023: ఎల్ఐసీ నుంచి భారీ నోటిఫికేషన్, డిగ్రీ అర్హతతో రూ. 51,500 జీతం.. వివరాలు ఇవి..

లైఫ్ ఇన్స్యూరెన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) నుంచి భారీ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9,394 అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్(ఏడీఏ)  ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఒక్క సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ హైదరాబాద్ కేంద్రంగా వివిధ డివిజనల్ ఆఫీసుల్లో పనిచేసేందుకు 1,408 అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్(ఏడీఏ) పోస్టులను ప్రకటించింది.

LIC Recruitment 2023: ఎల్ఐసీ నుంచి భారీ నోటిఫికేషన్, డిగ్రీ అర్హతతో రూ. 51,500 జీతం.. వివరాలు ఇవి..
Lic Notification
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 24, 2023 | 3:52 PM

లైఫ్ ఇన్స్యూరెన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) నుంచి భారీ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9,394 అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్(ఏడీఏ)  ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఒక్క సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ హైదరాబాద్ కేంద్రంగా వివిధ డివిజనల్ ఆఫీసుల్లో పనిచేసేందుకు 1,408 అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్(ఏడీఏ) పోస్టులను ప్రకటించింది.

రూ. 51,500 స్టైపెండ్..

ఈ అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులకు 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు ఉన్న భారతీయ పౌరులు అర్హులు. దీనిలో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 51,500 వేతనం అందిస్తారు. ఒక సంవత్సరం ప్రోబేషన్ పిరియడ్ ఉంటుంది. అర్హతున్న అభ్యర్థులు ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్ లో 21/01/023 నుంచి 10/02/2023 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

జోన్ల వారీగా ఖాళీలు ఇలా..

  • తూర్పు జోనల్ కార్యాలయం (కోల్‌కతా) – 1049
  • వెస్ట్రన్ జోనల్ ఆఫీస్ (ముంబై) – 1942
  • ఉత్తర జోనల్ కార్యాలయం (న్యూ ఢిల్లీ) – 1216
  • ఈస్ట్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (పాట్నా) – 669
  • నార్త్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (కాన్పూర్)- 1033
  • దక్షిణ జోనల్ కార్యాలయం (చెన్నై) – 1516
  • సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (హైదరాబాద్)- 1408
  • సెంట్రల్ జోనల్ ఆఫీస్(భోపాల్)- 561

ఆంధ్రప్రదేశ్ లో కడప , మచిలీపట్నం, నెల్లూరు , రాజమండ్రి , విశాఖపట్నం జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

తెలంగాణలో సికింద్రాబాద్, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ డివిజన్ల పరిధిలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అర్హతలు..

  1. ఏదైనా గుర్తింపు కలిగిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.
  2. 01/01/2023 నాటికి 21 ఏళ్లకు పైబడి 30 ఏళ్ల లోపు ఉండాలి. అభ్యర్థులు 02.01.1993 తర్వాత 01.01.2002లోపు పుట్టిన వారై ఉండాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎల్ఐసీ ఎంప్లాయీమెంబర్, ఎక్స్ సర్వీస్ మెన్ లకు గరిష్ట వయో పరిమితి సడలింపు ఉంటుంది.
  3. దరఖాస్తు రుసుం ఎస్సీ/ఎస్టీలకు రూ. 100, మిగిలిన వారికి రూ. 750 .

ఎంపిక ప్రక్రియ..

ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. ప్రిలిమ్స్ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.

ప్రిలిమినరీ పరీక్ష.. దీనిని 100 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌తో సహా మూడు విభాగాలు ఉంటాయి. రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాలకు కలిపి మార్కులు 70 (35+35), ఇంగ్లిష్ నుంచి 30 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. వీటిలో అర్హత సాధించిన వారు మెయిన్స్ పరీక్షకు అర్హులు అవుతారు.

మెయిన్స్ పరీక్ష.. దీనిని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. మొత్తం 150 మార్కులను కలిగి ఉంటుంది. దీనిలో మంచి మార్కులు సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూకు హాజరవ్వాలి.

మెడికల్ ఎగ్జామినేషన్.. ఇంటర్వ్యూ తర్వాత అర్హత పొందిన దరఖాస్తుదారులు తప్పనిసరిగా మెడికల్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం హాజరు కావాల్సి ఉంటుంది. వారు ఈ దశలో విజయం సాధిస్తే.. అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ (ADO) ఉద్యోగం పొందుతారు.

పూర్తి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..

అప్లై చేయడానికి క్లిక్ చేయండి..

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.