AP Constable Exam 2023: ఏపీ పోలీసు కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌కు 90 శాతం హాజరు.. ఫలితాలు ఎప్పుడంటే..

ఆంధప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ కోసం ఆదివారం (జనవరి 22) నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 997 కేంద్రాల్లో..

AP Constable Exam 2023: ఏపీ పోలీసు కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌కు 90 శాతం హాజరు.. ఫలితాలు ఎప్పుడంటే..
AP Police Constable Prelims
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 23, 2023 | 9:19 PM

ఆంధప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ కోసం ఆదివారం (జనవరి 22) నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 997 కేంద్రాల్లో జ‌న‌వ‌రి 22న‌ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పరీక్ష నిర్వహించారు. ఉదయం 10 గంటలకు పరీక్ష మొదలవగా.. నిమిషం నిబంధన కారణంగా పలువురు వెనుదిరగాల్సి వచ్చింది. మొత్తం 6,100 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ కోసం పరీక్ష నిర్వహించగా 5,03,487 మంది అభ్యర్థులు హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. వారిలో 4,58,219 మంది హాజరయ్యారు. 45,268 మంది గైర్హాజరయ్యారు. దాదాపు 91 శాతం మంది హాజరయ్యారని, రెండు వారాల్లో ఫలితాలు వెల్లడిస్తామని పోలీస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌ మనీష్‌ కుమార్‌ సిన్హా వెల్లడించారు. ఈ పరీక్షకు సంబంధించి మొత్తం 4 సెట్ల ప్రశ్నపత్రాల ప్రైమరీ ఆన్సర్‌ ‘కీ’ ఆదివారం వెబ్‌సైట్‌లో ఉంచింది. నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా mail-slprb@ap.gov.in మెయిల్‌ ఐడీకి అభ్యంతరాలను పంపించాలని సూచించింది.

క్వశ్చన్‌ పేపర్‌ ఎలా ఉందంటే..

ఐతే గతంలో జరిగిన కానిస్టేబుల్‌ పరీక్షలతో పోలిస్తే ఈసారి క్వశ్చన్‌ పేసర్‌ కొంత కఠినంగా వచ్చినట్లు అభ్యర్ధులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా భౌతిక, రసాయన శాస్త్రాలు, ఆంగ్లం విభాగాల నుంచి కఠినమైన ప్రశ్నలు వచ్చాయని, సబ్జెక్టుపైన పట్టు, పూర్తి స్థాయిలో అంశాలపై అవగాహన ఉన్నవారు మాత్రమే సమాధానాలు గుర్తించగలిగేలా ప్రశ్నలు ఉన్నాయని తెలిపారు. చరిత్ర, పాలిటీ విభాగాల నుంచి అడిగిన ప్రశ్నలు కొంత సులువుగా ఉన్నాయని, భౌగోళిక, ఆర్థిక శాస్త్రాలు, అర్థమేటిక్‌, రీజనింగ్‌ ప్రశ్నలు ఓ మోస్తరుగా ఉన్నాయన్నారు. కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ అంశాలపైన ఎక్కువ ప్రశ్నలు అడిగారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?