Vitamin A: విటమిన్‌ ఎ లోపంతో పలు అనారోగ్య సమస్యలు.. ఈ సూపర్‌ ఫుడ్స్‌ తీసుకుంటే మేలంటున్న నిపుణులు

శరీరంలో విటమిన్ ఎ లోపం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది.. దీనివల్ల ముఖ్యంగా చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వేగంగా వ్యాప్తి చెందుతాయి. అలాగే కంటి సమస్యలు పెరుగుతాయి. దృష్టి క్రమంగా తగ్గిపోతుంది.

Vitamin A: విటమిన్‌ ఎ లోపంతో పలు అనారోగ్య సమస్యలు.. ఈ సూపర్‌ ఫుడ్స్‌ తీసుకుంటే మేలంటున్న నిపుణులు
Vitamin A foods
Follow us

|

Updated on: Jan 26, 2023 | 1:55 PM

మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచడానికి శరీరానికి పోషకాలు, విటమిన్లు పుష్కలంగా అవసరం. ముఖ్యంగా విటమిన్‌ ఎ. వివిధ అనారోగ్య సమస్యల నుంచి రక్షించడంలో ఇది చాలా కీలకం. అయితే అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం తీసుకునే టప్పుడు మనం చేసే పొరపాట్ల వల్ల చాలామంది విటమిన్ ఎ లోపంతో బాధపడుతున్నారు. శరీరంలో విటమిన్ ఎ లోపం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది.. దీనివల్ల ముఖ్యంగా చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వేగంగా వ్యాప్తి చెందుతాయి. అలాగే కంటి సమస్యలు పెరుగుతాయి. దృష్టి క్రమంగా తగ్గిపోతుంది. అయితే చాలామంది విటమిన్‌ ఎ కంటెంట్‌ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఫలితంగా చేతులారా సమస్యలను కొని తెచ్చుకుంటారు. ఇలాంటి వారు విటమిన్‌ ఎ సప్లిమెంట్స్‌ కు బదులు కొన్ని రకాల ఆహార పదార్థాలు తరచుగా తీసుకుంటే మంచింది. అవేంటో తెలుసుకుందాం రండి. పాల ఉత్పత్తులలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి పాలు, చీజ్ వంటి పాల ఉత్పత్తులను ఆహారంలో చేర్చుకోవడం శరీరంలో విటమిన్‌ ఎ కంటెంట్‌ స్థాయులు పెరుగుతాయి.

గుడ్డు

రోజూ గుడ్డు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో అమినో యాసిడ్ పుష్కలంగా ఉంటుంది మరియు గుడ్డు పచ్చసొనలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కూరగాయలు

మీ ఆహారంలో టమోటాలు, బీట్‌రూట్, క్యారెట్, బత్తాయి మొదలైన విటమిన్ ఎ అధికంగా ఉండే కూరగాయలను చేర్చుకోండి.

చేపలు లేదా చేప నూనె

ఇందులో విటమిన్ ఎ మరియు ఒమేగా 3 పుష్కలంగా ఉన్నాయి, ఇది మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..